PBKS Co Owner Ness Wadia react on Sam Curran  Rs 18.50 crore: కొచ్చి వేదికగా శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2023 మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరన్‌.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్‌ కింగ్స్‌ అతడిని రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో క్రిస్ మోరిస్ (16.25 crore), యువరాజ్ సింగ్ (16 crore) రికార్డును సామ్ బద్దలు కొట్టాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ 2022లో సామ్ బంతితో అదరగోట్టడంతోనే అతడికి ఈ జాక్‌పాట్ తగిలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్‌ కింగ్స్ పోటీ పడి సామ్ కరన్‌ ధరను పెంచాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా మధ్యలో రావడంతో.. సామ్ హాట్ కేక్ మాదిరి అయిపోయాడు. బెంగళూరు, చెన్నై తప్పుకున్నా.. ముంబై, పంజాబ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాంతో కరన్ ఐపీఎల్ వేలంలో రికార్డు ధరను సొంతం చేసుకొన్నాడు. చివరకు కరన్‌ను పంజాబ్‌ రూ.18.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది. తొలిసారి ఐపీఎల్‌లో అడుగు పెట్టినప్పుడు కరన్ పంజాబ్‌కే ఆడాడు. గతేడాది చెన్నై తరఫున ఆడిన అతడు ఇప్పుడు పంజాబ్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. 


అయితే సామ్ కరన్‌పై భారీ మొత్తం వెచ్చించడానికి గల కారణాలను పంజాబ్‌ కింగ్స్‌ డైరెక్టర్‌, సహ వ్యవస్థాపకుడు నెస్ వాడియా తెలిపారు. 'మా వద్ద తగినంత పర్స్ వాల్యూ ఉంది. అందుకే సామ్ కరన్‌ను భారీ ధరకు దక్కించుకొన్నాం. కరన్‌ మళ్లీ మా జట్టుతో కలవడం ఆనందంగా ఉంది. గతంలోనే కరన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాం. అయితే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకొంది. ఇప్పుడు తీవ్ర పోటీలో మా సొంతమయ్యాడు. కరన్ ప్రపంచశ్రేణి ఆటగాడు. అతను ఏదైనా ప్రపంచ XI జట్టులో ఆడతాడు. జట్టుకు గొప్ప సమతుల్యతను తీసుకువస్తాడు' అని వాడియాచెప్పారు. 


ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర:
సామ్ క‌ర‌న్ - ₹18.5 కోట్లు
కామెరాన్ గ్రీన్ - ₹17.5 కోట్లు
క్రిస్ మోరిస్ - ₹16.25 కోట్లు
యువరాజ్ సింగ్ - ₹16 కోట్లు
పాట్ కమిన్స్ - ₹15.5 కోట్లు
ఇషాన్ కిషన్ - ₹15.25 కోట్లు
కైల్ జేమీసన్ - ₹15 కోట్లు


Also Read: IPL 2023 Auction: ఐపీఎల్‌ వేలంలో జాక్‌పాట్‌ కొట్టిన గుంటూరు కుర్రోడు.. ఏకంగా ఎంఎస్ ధోనీతోనే ఆడే ఛాన్స్!  


Also Read: Happy Birthday Neeraj Chopra: క్రికెట్‌ రాజ్యమేలుతున్న భారత దేశంలో గోల్డెన్ హీరో.. నీరజ్ చోప్రా టాప్ 5 రికార్డ్స్ ఇవే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.