Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లుకు ప్రభుత్వాలు ఇప్పటికే భారీ నజరానాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ ప్రభుత్వం ఓ అడుగు ముండుకేసి..వారిని ప్రత్యేకంగా గౌరవించాలని నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌(Tokyo olympics)లో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టులోని ఆ రాష్ట్ర ఆటగాళ్ల పేర్లను పది ప్రభుత్వ పాఠశాలల(Government Schools)కు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ (CM Amarinder Singh) అంగీకారం తెలిపారని పంజాబ్ విద్యాశాఖా మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా (Vijay Inder Singla)స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథాపూర్‌ జలంధర్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌( Manpreet Singh)పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. ఇకపై ఆ పాఠశాల పేరును ఒలింపియన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌, మిథాపూర్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే అమృత్‌సర్‌లోని తిమ్మోవల్‌ పాఠశాల పేరును వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(Harmanpreet Singh) పేరుతో మార్చనున్నట్లు పేర్కొన్నారు. అట్టారి పాఠశాల పేరును ఒలింపియన్‌ శంషర్‌ సింగ్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌గా.. ఫరీద్‌కోట్‌లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్‌ రూపిందర్‌పాల్‌ సింగ్‌(Rupinder Pal Singh) ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మారుస్తామన్నారు. 


Also Read: Virat Kohli : విరాట్ తాగే వాటర్ లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!


ఖుస్రోర్‌పూర్‌ పాఠశాల పేరును ఒలింపియన్‌ హార్దిక్‌ సింగ్‌ పాఠశాల అని, గురుదాస్‌పూర్‌లోని చాహల్‌ కలాన్‌ పాఠశాల పేరును ఒలింపియన్‌ సిమ్‌రంజిత్‌ సింగ్‌ ప్రభుత్వ పాఠశాలగా మార్చనున్నట్లు మంత్రి వివరించారు. కాగా, ఒలింపిక్స్‌(Olympics) క్రీడల్లో ఘన చరిత్ర కలిగిన భారత పురుషుల హాకీ జట్టు(Indian men's hockey team) గత 40 ఏళ్లుగా పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో టోక్యోలో చెలరేగిన ఈ జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌లో జర్మనీ(Germany)ని ఓడించి కాంస్య పతకంతో మెరిశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook