BWF World Championship 2021: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో(quarterfinals) ఓటమిపాలైంది. స్పెయిన్‌లో జరుగుతున్న బీడబ్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌(BWF World Championship 2021)లో చైనీస్ తైపీకి చెందిన తాయ్ ట్జు యింగ్( Tzu Ying) చేతిలో వరుస సెట్లలో సింధు(PV Sindhu) ఓడిపోయింది. 42 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్ లో తాయ్  21-17, 21-13తో  సింధును ఓడించింది. 2019లో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. సింధుతో పాటు కిదాంబి శ్రీకాంత్(Srikanth), హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సింధు ఓటమితో మహిళల సింగిల్స్‌లో భారత్‌ ఆశలు గల్లంతయ్యాయి. పురుషుల సింగిల్స్‌పై ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఈ ముగ్గురు ఆటగాళ్లు సిద్దమవుతున్నారు. 


Also Read: West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ లో కరోనా కలకలం- 5 మందికి కొవిడ్ పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook