West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ లో కరోనా కలకలం- 5 మందికి కొవిడ్ పాజిటివ్

West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న విండీస్ జట్టులో మరో ముగ్గురు క్రికెటర్లు సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. కొవిడ్ బారిన పడిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు వెస్టిండీస్ బోర్డు అధికారులు తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 05:00 PM IST
    • వెస్టిండీస్ క్రికెట్ టీమ్ లో కరోనా కలకలం
    • 5 మందికి కరోనా సోకినట్లు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటన
    • వైరస్ బారిన పడిన వాళ్లను క్వారంటైన్ కు తరలింపు
West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ లో కరోనా కలకలం- 5 మందికి కొవిడ్ పాజిటివ్

West Indies Cricket Team Covid: వెస్టిండీస్​ క్రికెట్​ జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. విండీస్ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకగా.. అదే టీమ్ కు సంబంధించిన మరో ఇద్దరు సహాయ సిబ్బంది కొవిడ్ బారిన పడినట్లు ఆ దేశ బోర్డు తెలిపింది. 

పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న వికెట్​కీపర్​-బ్యాటర్ షాయ్ హోప్​, స్పిన్నర్​ అకీల్ హోసేన్​, ఆల్​రౌండర్​ జస్టిన్ గ్రీవ్స్​ సహా సహాయక కోచ్ రాడీ ఎస్ట్​విక్, జట్టు ఫిజీషియన్​ డా.అక్షయ్ మాన్​సింగ్​కు వైరస్ సోకినట్లు ప్రకటించారు. పాక్​ క్రికెట్ బోర్డు నిర్వహించిన తాజా పరీక్షల్లో వీరికి పాజిటివ్​గా తేలింది.

దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు సహా సహాయక సిబ్బందిని ఐసొలేషన్​కు పంపించినట్లు వెస్టిండీస్​ క్రికెట్ బోర్డు తెలిపింది. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది. అంతకుముందు ఇదే జట్టులో ఉన్న రోష్టన్​ ఛేజ్​, షెల్డన్​ కాట్రెల్​, కైల్​ మేయర్స్​తో పాటు మరో సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన విండీస్ క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది.

మరోవైపు పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి మూడో టీ20 ఆడాల్సిఉంది. తొలి రెండు మ్యాచుల్లో పాక్​ విజయం సాధించింది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నాయి.  

Also Read: Jos Buttler: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన జోస్ బట్లర్.. బిత్తరపోయిన ఆస్ట్రేలియా ఓపెనర్ (వీడియో)

Also Read: BCCI vs Team India Captains: బీసీసీఐపై వ్యతిరేకత కనబర్చిన మాజీ ఇండియా కెప్టెన్లు ఎవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News