Rahul-Rohit Comments: క్రికెట్ ప్రపంచానికి క్రికెట్ డేటా సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న స్పోర్ట్స్ మెకానిక్స్ 20వ వార్షికోత్సవం బీసీసీఐతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో  టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ మాటల్లో..


డేటా ఎనాలసిస్‌తో చాలాకాలంగా అనుబంధముంది. ఇందులో చాలా అభివృద్ధి సాధిస్తున్నాం. ఈ విషయంలో కంప్యూటర్ ఏం చేస్తుందనే విషయంపై చాలా సందేహాలుండేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న జట్లు కూడా వీడియో ఎనాలసిస్‌పై ఆధారపడుతున్నాయి. ఇది చాలా విలువైంది. చాలామందికి ఈ విశ్లేషణపై ఆసక్తి కూడా ఉంటోంది. గతంలో మేం బ్యాటింగ్ చేస్తామనే విషయాన్ని పుస్తకాలు, ఫ్లిప్‌బుక్స్ ద్వారా విశ్లేషించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సాంకేతికత, లభ్యమౌతున్న డేటా ఆట తీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నాయి. జీవితంలో అన్నీ ముందుకు సాగినట్టే క్రికెట్ కూడా పురోగతి సాధిస్తోంది. ఈ సాంకేతికత యువ క్రికెటర్లకు అందుబాటులో ఉంటూ ఉపయోగపడుతోంది.


నేను మొదటి సారి 1996లో క్రికెట్ ఆడటాన్ని ఇంగ్లండ్‌లో మా నాన్నగారు చూశారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆటగాళ్లలో అంతర్లీనంగా ఉన్న సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు డేటా, సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుందని ఒక కోచ్‌గా చెప్పగలను. సమర్ధులైన ఆటగాళ్లను తయారుచేసేందుకు దోహదపడుతుంది. చాలామంది సామర్ధ్యమున్న కోచ్‌లకు ఈ డేటా అవసరమౌతుంది. 20 ఏళ్ల క్రితం ఆటగాళ్లకు ఇప్పటి ఆటగాళ్లకు చాలా తేడా ఉంది. స్పోర్ట్స్ కెరీర్‌లో ప్రతిభ, సామర్ధ్యం, అభిరుచిని గుర్తించేందుకు డేటా, సాంకేతిక ఉపయోగపడుతున్నాయి.


డేటా, విశ్లేషణలో చాలామంది జీవితాలు మెరుగుపడటమే కాకుండా చాలామంది ఎదుగుదలకు దోహదపడ్డాయి. సాంకేతికత పెరిగే కొద్దీ మనం మరింతగా రాటుదేలతాం. కొన్ని సందర్భాల్లో డేటా ఎక్కువగా ఉన్నప్పుడు ఏది అవసరం, ఏది బాగుంది, ఏది బాలేదనేది తెలుసుకోవల్సి ఉంటుంది. శిక్షణ ఎలా ఇవ్వాలనే విషయంపై చాలా సవాళ్లు ఎదుర్కొంటుంటాం. ఎప్పుడు ఎలా చేయాలనేది అతి పెద్ద టాస్క్.


టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ


ఇదొక అందమైన అనుభవమైన జర్నీ. డేటా ఎలా ఉపయోగపడుతుందో రాహుల్ చెప్పారు. ఎలా ఉపయోగించాననేది నా అనుభవం నేను చెబుతున్నాను. 2013లో నన్ను మిడిల్ ఆర్డర్‌లో దిగమని చెప్పేవాళ్లు. ఆ తరువాత ఓపెనింగ్ చేయమని అడిగినప్పుడు చాలా సవాలుగా ఉండేది. డేటా ఆధారంగా ఇతరులు ఎలా ఓపెనింగ్ ఎదుర్కోనేవాళ్లో తెలుసుకునేందుకు వీలుండేది. ఇవాళ మొత్తం ప్రపంచం సాంకేతికతవైపుకు పయనిస్తోంది. డేటా విశ్లేషణ వినియోగం చాలా అవసరం కూడా. 


డేటా ఆధారంగా చాలామంది యువ క్రీడాకారుల సామర్ధ్యం అందుబాటులోకి వచ్చింది. అందరి గురించి తెలుస్తోంది. డేటా పరంగా ఏ ఒక్కరూ సుశిక్షితుడు కాడు. క్రికెటర్లకు చాలా అవకాశాలుంటాయి. డేటా అనేది క్రికెటర్లందరికీ ఉపయుక్తమైంది. స్పోర్ట్స్ మెకానిక్స్ టీమ్ అందర్నీ నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రానున్న ఐదేళ్లు మరింత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను.


Also read: MS Dhoni: ఎంఎస్ ధోనీ నా ఆస్తులు ఏం తీసుకోలేదు.. పూర్తి క్లారిటీ ఇచ్చిన హర్భజన్‌ సింగ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook