ఒలంపిక్స్‌లో టీ20 క్రికెట్ ప్రవేశపెడితే బాగుంటుందనే డిమాండ్ గత నాలుగైదేళ్లుగా వినిపిస్తున్నదే. గతంలో అనేక మంది క్రికెట్ దిగ్గజాలు ఈ విషయంలో తమ అభిప్రాయాలను వినిపించారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టేన్ రాహుల్ ద్రావిడ్ సైతం టీ20 క్రికెట్‌ని ఒలంపిక్ క్రీడల్లో చేర్చితే బాగుంటుందని స్పష్టంచేశాడు. ఏ న్యూ ఇన్నింగ్స్ ( A New Innings book) అనే పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన వర్చువల్ మీట్ సందర్భంగా రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. ''టీ20 క్రికెట్‌ని ఒలంపిక్స్‌లో చేర్చాలి'' అనే డిమాండ్‌ని బలపరుస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. తగిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటే క్రికెట్ నిర్వహణ పెద్ద కష్టమైన సవాలు కాదని చెబుతూ ఇటీవలే ఐపిఎల్ 2020 టోర్నమెంట్ విజయవంతంగా ముగించడాన్ని ఒక ఉదాహరణగా ప్రస్తావించారు. టీ20 క్రికెట్‌‌ అభివృద్ధికి తాను ఎప్పుడూ అనుకూలమే అని అని ద్రావిడ్ పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Krunal Pandya: ఎయిర్‌పోర్టులో పాండ్యాను ఆపిన డీఆర్ఐ అధికారులు


ఐపిఎల్ 2020లో ముంబై ఇండియన్స్ విజయానికి కారణాలు చెప్పిన ద్రావిడ్:
ఐపిఎల్ 2020లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచి ఐదోసారి ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐపిఎల్ టోర్నమెంట్స్‌లో ముంబై ఇండియన్స్ విజయం వెనుకున్న కారణాలను రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) విశ్లేషిస్తూ... ముంబై ఇండియన్స్ గత నాలుగైదేళ్లుగా పకడ్బందిగా వ్యూహరచన చేసుకుంటూ వస్తున్నారని అన్నాడు. 


Also read : Rohit Sharma: ఆ ప్లేయర్స్‌కు సైతం ధన్యవాదాలు తెలిపిన రోహిత్ శర్మ


ముంబై ఇండియన్స్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు సత్తా కలిగిన యువ ఆటగాళ్లను కూడా జట్టులో భాగం చేయడమే వారి బలంగా మారింది అని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ విజయానికి అదే కీలకమైంది అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. 2013, 2015, 2017, 2019 తో పాటు ఐపిఎల్ 2020 టోర్నమెంట్స్‌లోనూ ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌‌పై ( Mumbai Indians ) సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని ఆసక్తికరమైన వార్తలు, అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి