Rajasthan Royals recreated Shah Rukh Khan's Om Shanti Om song: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 వేలం తాజాగా బెంగళూరులో ముగిసిన విషయం తెలిసిందే. వేలంలో ప్రతి ప్రాంచైజీ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి. కొందరి స్వదేశీ, విదేశీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఇక ఐపీఎల్ 2022 మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఫ్రాంచైజీలు 15వ సీజన్ కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు, వ్యూహాలను రచించడంలో బిజీ అయిపోనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2022 వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకుంది. సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లను రాజస్థాన్ రిటైన్ చేసుకోగా.. వేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకుంది. ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్ నైల్, రాసి వాన్ డెర్ డుసెన్ లాంటి స్టార్ ఆటగాళ్లను ఎంచుకుంది. మొత్తంగా రాజస్థాన్ గతంలో కంటే చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి ప్లేయర్స్ ఉండడంతో ఈసారి కప్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 


రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఆటగాళ్లకు వినూత్నంగా వెల్‌కమ్ చెప్పింది. మంగళవారం (ఫిబ్రవరి 15) ప్రముఖ బాలీవుడ్ పాట 'ఓం శాంతి ఓం' మార్ఫింగ్ వీడియోను రాజస్థాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో కెప్టెన్ సంజూ శాంసన్ తన జట్టు సబ్యులకు స్వాగతం పలికాడు. షారుక్ ఖాన్ ముఖంను మార్ఫింగ్ చేసి సంజూని పెట్టింది. యుజ్వేంద్ర చహల్, సంజూతో మొదలైన వీడియో కుమార సంగక్కర ఎంట్రీతో ఎండ్ అయింది. సల్మాన్, సైఫ్, సంజయ్, గోవిందా, రణవీర్, రితేష్, అర్బాజ్ స్థానాల్లో రాజస్థాన్ క్రికెటర్లు సందడి చేశారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 



రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇదే:
సంజు శాంసన్ – రూ. 14 కోట్లు


జోస్ బట్లర్ – రూ. 10 కోట్లు


కరుణ్ నాయర్ – రూ. 1.4 కోట్లు


యశస్వి జైస్వాల్ – రూ. 4 కోట్లు


ట్రెంట్ బౌల్ట్ – రూ. 8 కోట్లు


నవదీప్ సైనీ- రూ. 2.60 కోట్లు


షిమ్రాన్ హెట్మెయర్ – రూ. 8.50 కోట్లు


రవిచంద్రన్ అశ్విన్ – రూ. 5 కోట్లు


యుజ్వేంద్ర చహల్ – రూ. 6.5 కోట్లు


కుల్దీప్ యాదవ్ – రూ. 20 లక్షలు


జేమ్స్ నీషమ్ – రూ. 1.5 కోట్లు


నాథన్ కౌల్టర్-నైల్ – రూ. 2 కోట్లు


దేవదత్ పడిక్కల్ – రూ. 7.75 కోట్లు


రాసి వాన్ డెర్ దుసాన్ – రూ. 1 కోటి


ప్రసిద్ కృష్ణ – రూ. 10 కోట్లు


రియాన్ పరాగ్ – రూ. 3.8 కోట్లు


కెసి కరియప్ప- రూ. 30 లక్షలు


ఒబెడ్ మెక్‌కాయ్ – రూ. 75 లక్షలు


అరుణయ్ సింగ్ – రూ. 20 లక్షలు


కుల్దీప్ సింగ్ – రూ. 20 లక్షలు


ధృవ్ జురెల్ – రూ. 20 లక్షలు


తేజస్ బరోకా – రూ. 20 లక్షలు


శుభమ్ అగర్వాల్ – రూ. 20 లక్షలు
 


Also Raed: Virat Kohli 100th Test: బెంగళూరులో కాదు.. విరాట్ కోహ్లీ వందో టెస్ట్ ఆడేది ఎక్కడో తెలుసా?


Also Read: Bappi Lahiri: బప్పి లహిరి మెడ నిండా బంగారం.. ఎందుకలా కనిపించేవాడో తెలుసా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook