IPL 2024: బెంగళూరుతో మ్యాచ్ కు పింక్ జెర్సీలతో బరిలోకి రాజస్థాన్.. కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు..

RR VS RCB Match: బెంగళూరుతో ఇవాళ జరగబోయే మ్యాచ్ కు రాజస్థాన్ జట్టుకు ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ మ్యాచ్ కు సంజూసేన పింక్ జెర్సీతో బరిలోకి దిగబోతుంది. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదివేయండి మరి.
Rajasthan Royals Unveil New Pink Jersey: ఎన్నడూ లేని ఉత్కంఠతో సాగుతోంది ఐపీఎల్ 17వ సీజన్. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి మాంచి జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మరో యుద్ధానికి సిద్దమైంది. మరికాసేపట్లో హోం గ్రౌండైన జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సంజూ సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ కు ఓ స్పెషల్ జెర్సీతో బరిలోకి దిగబోతుంది రాయల్స్ టీమ్.
కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు..
సంజూ సేన గులాబీ రంగు జెర్సీ ధరించి ఆర్సీబీతో మ్యాచ్ ఆడబోతున్న రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. #PinkPromise పేరిట ఈ మ్యాచ్ ఆడబోతుంది ఆర్ఆర్. మహిళా సాధికారితే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో విక్రయించే ప్రతి టిక్కెట్టు నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో రొట్టే ప్రతి సిక్స్‌కి రాజస్థాన్‌లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించనున్నారు. ఈ మ్యాచ్‌ను మహిళలు ఫ్రీగా వీక్షించేందుకు పింక్ పాస్‌లను కూడా అందజేశారు. మరి ఈ మ్యాచ్ లో రాజస్థాన్, బెంగళూరు జట్లు ఎన్ని సిక్సర్లు కొడుతాయోనని క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇరు జట్లు డ్రీమ్ 11 ఇదే..
రాజస్థాన్ జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, నాంద్రే బర్గర్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.
బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కెమెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
Also Read: IPL 2024 Points table: చెన్నైను కొట్టి టాప్-5లోకి సన్ రైజర్స్... అగ్రస్థానం ఎవరిదంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook