Ravi Shastri On Hardik Pandya: భారత క్రికెట్ మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఉన్న సీనియర్ టీమిండియా జట్లు కంటే.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఉన్న ప్రస్తుత టీ20 జట్టు చాలా మెరుగ్గా కనిపిస్తోందన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. పాండ్యా జట్టును ముందుండి నడిపించి.. టీ20 సిరీస్‌ను 1-0తో టైటిల్ అందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ న్యూజిలాండ్ పర్యటనపై వ్యాఖ్యానించిన మాజీ కోచ్ రవిశాస్త్రి.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఉన్న ఈ టీ20 జట్టు ఫీల్డింగ్ స్థాయి ఎంతో మంది యువ ఆటగాళ్ల చేరికతో చాలా బాగుందన్నాడు. హార్దిక్ పాండ్యాతో కూడిన ఈ జట్టులో యువ ఆటగాళ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉందని.. ఇది కచ్చితంగా ఫీల్డింగ్ స్థాయిని మెరుగు పరిచిందని అన్నాడు. 35 ఏళ్ల రోహిత్ మొత్తం 3 ఫార్మాట్లలో భారత్‌ను నడిపిస్తున్నాడని.. ఇక నుంచి హార్దిక్ పాండ్యాకు పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు.  


హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ప్రస్తుత టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు మాత్రమే లేరు. ప్రస్తుతం జట్టులో అందరూ కుర్రాళ్లే ఉండడంతో టీమిండియా ఫీల్డింగ్ పరంగా మెరుగైన స్థితిలో ఉంటుందనే అభిప్రాయాన్ని రవిశాస్త్రి వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్‌లో దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉండటం వల్ల ఫీల్డింగ్ స్థాయి కాస్త బలహీన పడిన విషయం తెలిసిందే. 


ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. తన అద్భుత పర్ఫామెన్స్‌తో జట్టుకు టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌కు హార్దిక్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అన్న విషయంపై స్పష్టత లేకపోయినా.. అటాకింగ్ కెప్టెన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జట్టును నడిపించే మార్గమని చూపించాడు. అతి త్వరలోనే పొట్టి ఫార్మాట్‌కు హార్థిక్ కచ్చితంగా కెప్టెన్ అవుతాడని మాజీలు అంచనా వేస్తున్నారు. 


Also Read: Minister Malla Reddy: మహేందర్ రెడ్డికి అస్వస్థత.. తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు   


Also Read: Delhi Murder: ఢిల్లీలో మరో దారుణం.. తండ్రి, అక్కాచెల్లెళ్లు, బామ్మను హత్య చేసిన యువకుడు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి