`డీజే వాలె బాబు`గా మారిన రవి శాస్త్రి
టీమిండియా కోచ్ రవి శాస్త్రి కాస్త ఉన్నట్టుండి డీజే వాలె బాబు అయ్యాడు. అదెలా అంటారా ? అయితే, ఇదిగో ట్విటర్‌లో రవి శాస్త్రి పెట్టిన ఈ పోస్టుని ఓసారి గమనించిండి..
టీమిండియా కోచ్ రవి శాస్త్రి కాస్త ఉన్నట్టుండి డీజే వాలె బాబు అయ్యాడు. అదెలా అంటారా ? అయితే, ఇదిగో అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ట్విటర్‌లో రవి శాస్త్రి పెట్టిన ఈ పోస్టుని ఓసారి గమనించిండి.. డీజే వాయిస్తున్న స్టైల్లో వున్న ఫోటోని పోస్ట్ చేసి ఆ కిందే అందరికీ శుభాకాంక్షలు చెప్పిన రవి శాస్త్రిని చూసిన అతడి అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అందుకే తమ ఫేవరేట్ క్రికెటర్‌ని ముద్దుగా ఇలా 'డీజే వాలె బాబు' అని పిలుస్తూ అతడిపై తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో గుమ్మరించారు. టీమిండియా కోచ్ చేసిన ఈ ట్వీట్‌కి సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపించింది.
ఇక రవి శాస్త్రి ముందున్న ప్రస్తుత లక్ష్యం విషయానికొస్తే, సౌతాఫ్రికా పర్యటనలో భారత్ విజయం సాధించడమే. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు సౌతాఫ్రికాలో ఆ దేశంతో కలిసి టీమిండియా మూడు టెస్ట్ సిరీస్‌లు, ఆరు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ 20 ఇంటర్నేషనల్స్ ఆడనుంది. సౌతాఫ్రికాతో ఆ దేశం గడ్డంపై టీమిండియా ఇప్పటివరకు మొత్తం 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
భారత సొంత గడ్డపై టీమిండియాతో సౌతాఫ్రికా ఇప్పటివరకు 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా అందులో 8 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 5 మ్యాచ్‌ల్లో ఓటిపాలైంది. మరో మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. సొంత గడ్డపై సౌతాఫ్రికాను ఢీకొనడంలో మంచి రికార్డు వున్న టీమిండియా ఈసారి సౌతాఫ్రికా గడ్డపై ఆ జట్టుని ఎదుర్కోబోతోంది. గత రికార్డు ఎలా వున్నా... ఈసారి తమ జట్టు సిరీస్ సొంతం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తంచేస్తున్నాడు రవిశాస్త్రి.