BCCI asked Ravindra Jadeja to play at least one domestic game to prove fitness: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే 'బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ'లోని తొలి రెండు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. టీ20లో విధ్వంసక ఆటతో చెలరేగుతున్న మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ను తొలిసారి టెస్టు టీమ్‌లోకి ఎంపిక చేశారు. అలానే వన్డేలో డబుల్ సెంచరీ చేసిన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు కూడా తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కింది. కారు ప్రమాదానికి గురైన కీపర్‌ రిషబ్ పంత్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేశారు. ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియాకప్ 2022 సమయంలో గాయపడి.. ఇప్పుడు కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు సైతం చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ భారత టెస్ట్ జట్టులో చోటు కల్పించింది. అయితే జడేజా ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టులోకి వస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇందుకోసం జడ్డు దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉందని సమాచారం తెలుస్తోంది. కనీసం ఓ దేశవాళీ మ్యాచ్ ఆడాలని జడేజాను బీసీసీఐ కోరినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయట.


టీ20 ప్రపంచకప్ 2022 పరాజయం అనంతరం బీసీసీఐ ప్రక్షాళనకు దిగిన విషయం తెలిసిందే. బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. పదవి ఎక్కేముందు చెప్పిన మాటలను తూచా తప్పకుండా అమలు చేస్తునాడు. ముందుగా సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన సంగతి విదితమే. ఇక సీనియర్ ఆటగాళ్లను టీ20లకు దూరం చేస్తూ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. తాజాగా బీసీసీఐ కొత్త సంప్రదాయానికి తెరలేపినట్లు సమాచారం తెలుస్తోంది. ఎంత పెద్ద ఆటగాడైనా గాయం నుంచి కోలుకొని జట్టులోకి రీఎంట్రీ వచ్చే క్రమంలో.. నేరుగా జట్టులోకి రాకుండా, దేశవాళీ మ్యాచులు ఆడి రావాలనే నిబంధన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని రవీంద్ర జడేజాతోనే మొదలు పెట్టాలని బీసీసీఐ భావించిందట.


కనీసం ఓ దేశవాళీ మ్యాచ్ ఆడి జట్టులోకి రావాలని రవీంద్ర జడేజాను బీసీసీఐ ఇప్పటికే కోరినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 'రవీంద్ర జడేజాను కనీసం ఓ దేశవాళీ మ్యాచ్ ఆడాలని బీసీసీఐ సూచించింది. జడ్డు ఫిట్‌నెస్ నిరూపించుకుంటే జట్టులోకి వస్తాడు.  అప్పుడు మిడిలార్డర్‌లో ఉన్న లెఫ్టాండర్ లోటు తీరుతుంది. అంతేకాకుండా భారత్ ఐదుగురు బౌలర్లతో ఆడే అవకాశం ఉంటుంది' అని ఓ పేర్కొన్నాయి. ఇక సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా‌కు కూడా ఇదే రూల్ వర్తించనుంది.  


Also Read: India Playing XI 3rd ODI: గిల్, శ్రేయస్ ఔట్.. సెంచరీ హీరోలు ఇన్! శ్రీలంకతో మూడో వన్డే ఆడే భారత తుది జట్టిదే  


Also Read: Jupiter Rise 2023: అరుదైన ధన రాజయోగం.. ఈ 3 రాశుల వారికి 'ప్రతిరోజూ పండగే'! ఇంటి నిండా నోట్ల కట్టలే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.