Royal Challengers Bangalore players celebration 2022 goes viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 లీగ్ దశ రసవత్తరంగా సాగింది. లీగ్ చివరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు జట్లన్ని ఎలా పోటీ పడ్డాయో. లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 16 పాయింట్స్ సాధించినా.. ప్లే ఆఫ్స్‌ బెర్త్ పక్కా కానీ పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్, నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అయితే రాజస్థాన్ ఓ మ్యాచ్ గెలిచి 18 పాయింట్లతో అధికారిక బెర్త్ సాధించగా.. 16 పాయింట్స్ ఉన్న బెంగళూరు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ విజయంపై ఆధారపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 లీగ్ దశలో 14 మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 విజయాలు అందుకుంది. 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. ఇక చివరి మ్యాచులో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధిస్తే.. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ బెర్త్ ఖరారు అవుతుంది. ఢిల్లీ నెట్ రన్ రేట్ బెంగళూరు కంటే ఎక్కువగా ఉండడం.. పంత్ సేనకు పెద్ద సానుకూలాంశం. కేవలం ముంబైపై గెలిస్తే ఢిల్లీకి ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కేదే. బెంగళూరు పరిస్థితి మాత్రం అలా కాదు. ముంబైపై ఢిల్లీ ఓడితేనే బెంగళూరు ప్లే ఆఫ్స్‌ వెళుతుంది. 


ముంబై ఇండియన్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కనున్న నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లు ఢిల్లీ, ముంబై మ్యాచును ఆసక్తిగా చూశారు. టాస్ పడక ముందు నుంచే బెంగళూరు ఆటగాళ్లు మ్యాచ్ చూసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. పెద్ద స్క్రీన్‌పై లైవ్ పెట్టి. ప్లేయర్స్ అందరూ సీట్లలో కూర్చొని మ్యాచ్ చూశారు. ఢిల్లీ ఒక్కో వికెట్ పడుతుంటే.. బెంగళూరు ప్లేయర్స్ ఎంజాయ్ చేశారు. 



చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఢిల్లీ-ముంబై మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించిన బెంగ్లూరు.. ముంబై గెలుపు ఖరారు కాగానే ఆర్సీబీ ప్లేయర్స్ ఎగిరి గంతులేశారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సహచర ఆటగాళ్లను ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నాడు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మొహ్మద్ సిరాజ్‌ సహా ఆటగాళ్లు అందరూ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఊహించని ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కించుకున్న బెంగళూరు ప్లేటెర్స్ సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది.


Also Read: UP Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. 8 మంది అక్కడిక్కడే మృతి! పలువురికి తీవ్ర గాయాలు


Also Read: IPL 2022 Playoffs: క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లలో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook