UP Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. 8 మంది అక్కడిక్కడే మృతి! పలువురికి తీవ్ర గాయాలు

Uttar Pradesh Road Accident. యూపీలోని సిద్ధార్థ నగర్ జిల్లాలోని నౌగర్-బంసి రహదారిపై ఆదివారం ఉదయం ఎస్‌యూవీ వాహనం స్టేషినరీలోకి దూసుకుపోవడంతో ఎనిమిది మంది మరణించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 12:44 PM IST
  • భారీ రోడ్డు ప్రమాదం
  • 8 మంది అక్కడిక్కడే మృతి
  • పలువురికి తీవ్ర గాయాలు
UP Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. 8 మంది అక్కడిక్కడే మృతి! పలువురికి తీవ్ర గాయాలు

Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్‌లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని సిద్ధార్థ నగర్ జిల్లాలోని నౌగర్-బంసి రహదారిపై ఆదివారం ఉదయం ఎస్‌యూవీ వాహనం ఆగివున్న ట్రక్కును ఢీ కొట్టడంతో ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌యూవీలోని  ప్రయాణీకులందరూ వివాహ వేడుకలో పాల్గొన్నీ తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌యూవీలోని ప్రయాణికులు అందరూ మహ్లా గ్రామంలో ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలోని జోగియా కొట్వాలి ప్రాంతంకు రాగానే ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి ఆగివున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. 12 మందితో బయలుదేరిన ఎస్‌యూవీ వాహనంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Also Read: IPL 2022 Playoffs: క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లలో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Also Read: Types Of Savings Account: ఎన్ని రకాల సెవింగ్స్‌ అకౌంట్స్‌ ఉన్నాయి..వాటిలో మీకు ఏది ఉత్తమమైనదో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News