Royal Challengers Bengaluru Vs Chennai Super Kings Full Highlights: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ (47), రజత్ పటీదార్ (41), కామెరూన్ గ్రీన్ (38) రాణించారు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే చెన్నైను 200 పరుగులలోపు కట్టడి చేయాల్సి ఉండగా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది సీఎస్‌కే. దీంతో ఆర్‌సీబీ నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రచిన్ రవీంద్ర (61) హాఫ్‌ సెంచరీ బాదగా.. రవీంద్ర జడేజా (42 నాటౌట్), ఎంఎస్ ధోనీ (25) చివర్లో భారీ హిట్టింగ్‌తో ఆర్‌సీబీని భయపెట్టారు. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లో చేరిపోగా.. తాజాగా ఆర్‌సీబీ ఈ జట్లతో చేరిపోయింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లతో టాప్-2, 3 స్థానాలు కన్ఫర్మ్ కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు


219 పరుగుల లక్ష్యంతో బరిలోకి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ రచిన్‌ రవీంద్ర (37 బంతుల్లో 61, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో దూకుడుగా ఆడాడు. జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానె (22 బంతుల్లో 33, 3 ఫోర్లు, ఒక సిక్స్‌), ధోనీ (25) రాణించారు. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. యష్ దయాల్ వేసిన ఓ ఓవర్‌లో ఎంఎస్ ధోనీ తొలి బంతికే భారీ సిక్సర్ బాదాడు. అయితే ఆ తరువాత బంతికే క్యాచ్ అవుటయ్యాడు. చివరి ఐదు బంతులను దయాల్ చక్కగా వేయడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. ఆర్‌సీబీ యశ్‌ దయాల్‌ 2 వికెట్లు తీయగా.. మాక్స్‌వెల్‌, సిరాజ్‌, ఫెర్గూసన్‌, కామెరూన్‌ గ్రీన్ తలో వికెట్ తీశారు.


అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు, కెప్టెన్‌ డుప్లెసిస్‌ (39 బంతుల్లో 54, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), (విరాట్‌ కోహ్లీ 29 బంతుల్లో 47, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్‌ పటీదార్‌ (23 బంతుల్లో 41, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరూన్‌ గ్రీన్‌ (17 బంతుల్లో 38, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలగి ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టా.. తుశార్‌ దేశ్‌పాండే, శాంటర్న్‌ తలో వికెట్ తీశారు.


Read more: Vijayawada boy cpr: నువ్వు గ్రేట్ తల్లీ.... రోడ్డుపైన బాలుడికి సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter