Royal Challengers Bangalore Vs Punjab Kings Dream11 Tips: ఈ సీజన్‌లో సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌ ఆడబోతుంది. నేడు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైన ఆర్‌సీబీ.. పంజాబ్‌పై విజయం సాధించి బోణీ కొట్టాలని చూస్తోంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి జోరు మీదున్న పంజాబ్.. ఆర్‌సీబీని కూడా ఓడించాలని పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ నుంచి ఫ్యాన్స్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. రజత్ పటీదార్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది. ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్‌ నుంచి బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ తొలి మ్యాచ్‌లో ఆదుకోకపోతే ఆర్‌సీబీ భారీగా తేడాతో ఓడిపోయేది. అన్ని తప్పులు సరిదిద్దుకుని సొంతగడ్డపై దుమ్ములేపేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: GT vs MI: తొలి మ్యాచ్‌లో ముంబై బోల్తా.. కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో గుజరాత్‌ తొలి విజయం


చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు సర్వధామం. బౌండరీలు చిన్నవిగా ఉండడంతో బ్యాట్స్‌మెన్ సిక్సర్ల వర్షం కురిపిస్తారు. 200 పరుగులపైగా టార్గెట్‌ను ఈజీగా ఫినిష్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాతావరణం విషయానికి వస్తే.. సాయంత్రం పాక్షికంగా మేఘావృతమై ఎండ వచ్చే సూచన ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 30-34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. అయితే మ్యాచ్ ముగిసే సమయానికి 27 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 


ఐపీఎల్ చరిత్రలో వారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌తో 31 మ్యాచ్‌ల్లో తలపడింది. వీటిలో 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఫంజాబ్ 17 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరి ఐదు మ్యాచ్‌లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు విజయాలు సాధించగా.. పంజాబ్ మూడింటిలో గెలుపొందింది. JioCinema యాప్, వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా లైవ్ మ్యాచ్‌ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.


తుది జట్లు ఇలా.. (అంచనా)


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరున్ గ్రీన్, దినేష్ కార్తీక్ (ఇంపాక్ట్ ప్లేయర్), అనుజ్ రావత్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ ధయాల్.


పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, ప్రభుసిమ్రాన్ సింగ్ (ఇంపాక్ట్ ప్లేయర్).


RCB Vs PBKS Dream11 Team Tips:


వికెట్ కీపర్: అనుజ్ రావత్


బ్యాట్స్‌మెన్: శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), డుప్లెసిస్


ఆల్‌రౌండర్: మాక్స్‌వెల్, కామెరున్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్


బౌలర్లు: మహ్మద్ సిరాజ్, రబడా, అర్ష్‌దీప్ సింగ్.


Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter