Rajat Patidar 102m six Lands On Old Fan Head in the stands: ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్‌ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రజత్ పాటిదార్ (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మ్యాచులో ఓ సరదా సంఘటన జరిగింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్ రజత్ పాటిదార్ కొట్టిన ఓ భారీ సిక్స్ ముసలి అభిమాని గుండుపై పడింది. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హర్‌ప్రీత్ వేయగా.. పాటిదార్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచి స్టేడియం లోపల పడింది. ఆ సిక్స్ ఏకంగా 102 మీటర్లుగా వెళ్లింది. బంతి స్టాండ్ పైకప్పును తాకి.. ఆపై ఓ ముసలి అభిమాని గుండుపై పడింది.


బంతి తాకిన వెంటనే ఆ అభిమాని నొప్పితో విలవిలలాడిపోయాడు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు గుండుపై రుద్దడముతో అతడు కాస్త ఉపశమనం పొందాడు. బంతి ముందుగా పైకప్పును తాకడంతో పెద్దగా గాయం కాలేదు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చుసిన వారు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'పాపం పెద్దాయన', 'బాగా నొప్పేసిందేమో' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 



ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు దాదాపు అసాధ్యం అనుకున్న సమయంలో పంజాబ్‌ కింగ్స్‌ కీలక విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఏకపక్ష పోరులో బెంగళూరును అన్ని విభాగాల్లో చిత్తు చేసి రన్ రేట్ భారీగా మెరుగుపరుచుకుంది. మిగిలిన రెండు మ్యాచులో గెలిస్తే.. పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. మరోవైపు ముందంజ వేసేందుకు చేరువైన స్థితిలో భారీ పరాజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే బెంగళూరు ఆశలు సజీవంగా ఉంటాయి. 


Also Read: Allu Arjun Gift: అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్... మురిసిపోయిన నవదీప్... థ్యాంక్స్ బావ అంటూ..


Also Read: Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.