Indian cricket commentator Harsha Bhogle reacts on Telugu Actor Krishna death: దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల కృష్ణ చనిపోయినట్లు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. 350 పైగా సినిమాల్లో నటించి.. సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల దేశం నలుమూలల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశ ప్రధాని,  పలు రాష్ట్ర సీఎంలు, సినీ వ్యాపార ప్రముఖులు కృష్ణకు సంతాపం తెలిపారు. తాజాగా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా సువర్ స్టార్ కృష్ణ మృతిపై స్పందించారు. తన చిన్నతనంలో వెండితెరపై చూసిన మరో తార రాలిపోయిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో పుట్టి పెరిగిన హర్ష భోగ్లేకు తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరూ తెలుసు. చిన్న తనంలో తెలుగు సినిమాలు చూస్తూనే ఆయన పెరిగారు. 



'నా చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది. ఆయనే తెలుగు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్‌లతో పాటు కృష్ణ, శోభన్‌ బాబు, చంద్రమోహన్‌, మోహన్‌ బాబు, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి వంటి వారితో చేసిన సినిమాలు గుర్తుండిపోతాయి. సినిమాలు అన్ని దూరదర్శన్‌లో చూసేవాడిని' అని హర్ష భోగ్లే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన చాలా మంది తెలుగు సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే భోగ్లేకు తెలుగు తెలుసనీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 


Also Read: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. టీమిండియా కోచ్, డైరెక్టర్‌గా కొత్త బాధ్యత!


Also Read: Urvashi Rautela Pics: శారీలో సెగలు రేపుతున్న ఊర్వశి రౌతేలా.. నెవర్ బిఫోర్ అందాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook