Rishabh Pants Mercedes-Benz GLE Coupe 43 AMG 4Matic Car Price and Features: టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా పంత్ కారు.. రూర్కీ నర్సన్ సరిహద్దు వద్ద హమ్మద్‌పూర్ ఝల్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారత వికెట్ కీపర్ కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేశాడని సమాచారం తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పంత్‌ తల, మోకాలికి గాయాలయ్యాయి. కాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిషబ్ పంత్ తన మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్‌ఇ 43 4మ్యాటిక్ కూపేలో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ బయలుదేరాడు. మీడియా కథనాల ప్రకారం శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు పంత్‌ను చూసి 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో పంత్ వీపు భాగం కాలిపోగా.. కాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు దేహ్రాదూన్‌లో మ్యాక్స్‌ ఆసుపత్రివైద్యులు పేర్కొన్నారు. 


రిషబ్ పంత్ ప్రయాణించిన కారు మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్‌ఇ 43 4మ్యాటిక్ (Mercedes-Benz GLE Coupe 43 AMG 4Matic). ఈ కారును సెప్టెంబర్ 2019లో పంత్ కొనుగోలు చేశాడు. కారు రిజిస్ట్రేషన్ 25 సెప్టెంబర్ 2019 తేదీగా ఉంది. ఈ కారులో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 80 kmph కంటే ఎక్కువ వేగం ఉన్నప్పుడు 1 బీప్ వస్తుంది. 120 kmph కంటే ఎక్కువ వేగం ఉన్నప్పుడు బీప్స్ వస్తూనే ఉంటాయి. ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, ప్యాసింజర్, 2 కర్టెన్, డ్రైవర్ సైడ్, ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్) ఉన్నాయి.


రిషబ్ పంత్ ప్రయాణించిన కారులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), సీట్ బెల్ట్ అలెర్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్ (BA), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ నియంత్రణ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TC/TCS) మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర రూ. 99.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్ ఇంజన్‌తో నడిచే ఈ కారు ఆన్-రోడ్ ధర కోటి రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. 


Also Read: Hangover Home Remedies: పార్టీ తర్వాత హ్యాంగోవర్‌ అయిందా.. ఈ 5 సహజసిద్ధమైన హోం రెమెడీస్‌తో ఇట్టే తగ్గిపోతుంది!  


Also Read:  ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్.. నథింగ్ ఫోన్ (1)పై రూ. 30 వేల ఆఫర్! రూ. 7699కే ఇంటికితీసుకెళ్లండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.