Rishabh Pant: గ్రౌండ్‌లోకి రిషభ్ పంత్ రీఎంట్రీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!
Rishabh Pant Batting Video: రిషభ్ పంత్ రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అదిరిపోయే ఓ వీడియో తెరపైకి వచ్చింది. రోడ్డు ప్రమాదం తరువాత పంత్ బ్యాట్ పట్టి తొలిసారి గ్రౌండ్‌లోకి దిగాడు. పంత్ బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Rishabh Pant Batting Video: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గత 8 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్.. తొలిసారి ఓ లోకల్ మ్యాచ్‌లో బ్యాట్ పట్టి ఆడటం విశేషం. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్‌లో పంత్ కోలుకుంటున్నాడు. ఇండిపెండెన్స్ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ విజయ్‌నగర్‌లో తన స్పీచ్‌తో యువకులలో ఉత్సాహం నింపాడు. ఈ సందర్భంగా సరదాగా క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు. పంత్ క్రికెట్ ఆడిన వీడియో అక్కడ ఉన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
గ్రౌండ్‌లోకి అడుగుపెట్టేందుకు తన సెంటిమెంట్ ప్రకారం నేలను తాకి ఎంట్రీ ఇచ్చాడు. పంత్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే.. అక్కడ ఉన్న అభిమానులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. రెండు బంతులను డిఫెన్స్ ఆడిన పంత్.. మూడో బంతిని సిక్సర్ బాదాడు. పంత్ క్రికెట్ ఆడుతున్న విషయం తెలుసుకున్న అభిమానులు.. ఆ స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. రిషబ్ పంత్ మళ్లీ బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది డిసెంబరులో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 25 ఏళ్ల పంత్.. తీవ్ర గాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటికే మూడు సర్జరీలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్‌సీఏలో పునరావాసం పొందుతున్నాడు. పంత్ రాకకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయాల నుంచి కోలుకున్న పంత్.. జూలై 21 నుంచే బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు బీసీసీఐ వెల్లడించగా.. తాజాగా పంత్ క్రికెట్ ఆడిన వీడియో బయటకు రావడంపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంత్ లేకపోవడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారిపోయింది. ముఖ్యంగా టెస్టుల్లో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టోర్నీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో స్థానంలో ఆడిన కేఎస్ భరత్ పెద్దగా ఆకట్టులేకపోయాడు. వెస్టిండీస్ సిరీస్‌లో ఇషాన్ కిషన్‌ను ఆడించారు. ఈ ఏడాది చివరి నాటికి రిషభ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించే అవకాశం ఉంది.
Also Read: Wahab Riaz: క్రికెట్‌కు పాకిస్థాన్ బౌలర్ వహాబ్ రియాజ్ వీడ్కోలు.. రాజకీయాలపై దృష్టి..!
Also Read: Vishwak Sen: ఆహాలో సరికొత్త రియాలిటీ షో.. హోస్ట్‌గా విశ్వక్ సేన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి