Vishwak Sen: ఆహాలో సరికొత్త రియాలిటీ షో.. హోస్ట్‌గా విశ్వక్ సేన్

Aha Reality Show Family Dhamaka: నటుడిగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విశ్వక్ సేన్.. సరికొత్త పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఫ్యామిలీ ధమాకా అనే షో ద్వారా హోస్ట్‌గా అరంగేట్రం చేయనున్నాడు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 16, 2023, 07:04 PM IST
Vishwak Sen: ఆహాలో సరికొత్త రియాలిటీ షో.. హోస్ట్‌గా విశ్వక్ సేన్

Aha Reality Show Family Dhamaka: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా యాప్‌.. సరికొత్త సినిమాలతో పాటు ఎంటర్‌టైనర్‌మెంట్‌ షోలతో ఆడియన్స్‌ను అలరిస్తోంది. తాజాగా ఓ రియాలిటీ షోతో రానుంది. "ఫ్యామిలీ ధమాకా" పేరుతో షోను ప్రారంభించనుండగా.. విశ్వక్ సేన్‌ను హోస్ట్‌గా ప్రకటించడం ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో హోస్ట్‌గా విశ్వక్ సేన్ తొలిసారి అరంగేట్రం చేయనున్నాడు. తనలో సరికొత్త కోణాన్ని ఆడియన్స్‌కు పరిచయం చేయనున్నాడు. 

ఇప్పటికే ఆకర్షణీయమైన షోలతో ఆహా అలరిస్తోంది. నందమూరి బాలయ్యతో "అన్‌స్టాపబుల్," "తెలుగు ఇండియన్ ఐడల్", కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ప్రస్తుతం కొనసాగుతున్న "నేను సూపర్ ఉమెన్" వంటి బ్లాక్‌బస్టర్ రియాలిటీ షోలతో మెప్పించింది. ఈ షోలకు కొనసాగింపుగా "ఫ్యామిలీ ధమాకా" కూడా ఓటీటీ అభిమానులను అలరించి.. సూపర్ సక్సెస్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

ఈ షోకు కొంతమంది సెలబ్రిటీస్ ఫ్యామిలీని తీసుకువచ్చి విశ్వక్ ఆడించబోతున్నట్లు తెలుస్తోంది. వినోదంతోపాటు ఎమోషన్స్‌తో  "ఫ్యామిలీ ధమాకా" షో సాగనుంది. అన్ని వర్గాల ఆడియన్స్‌ను అలరించే విధంగా షో నిర్వాహకులు డిజైన్ చేస్తున్నారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని అప్‌టేట్స్‌ త్వరలోనే రానున్నాయి. "ఫ్యామిలీ ధమాకా" షో పోస్టర్‌ను, వీడియోను విశ్వక్ సేన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

"ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన ప్రేమ, సపోర్ట్‌తో నేను ఎంతో సంతోషంగా ఉన్నా. మీ అందరికీ మరింత చేరువ కావడానికి నేను కొంత సమయం కేటాయింనున్నాను. మీ ప్రేమను ఆస్వాదించడమే నాకు ప్రపం. ఉత్కంఠభరితమైన వినోదంతో దూసుకుపోతున్న నా సొంత గేమ్ షోతో అరంగేట్రం చేసినందుకు ఈ రోజు ప్రత్యేకమైన రోజు. ఈ అపురూపమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందరం కలిసి జ్ఞాపకాలను ఏర్పరుచుకుందాం.. అడుగడుగునా సందడి చేద్దాం! దస్ కా ఇలాకాలో ఫ్యామిలీ ధమాకా.. త్వరలో అత్యంత వినోదభరితమైన ఫ్యామిలీ గేమ్ షో.." అని రాసుకొచ్చాడు.

Also Read: Minister KTR: 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధం.. వచ్చే వారంలోనే తొలి దశ పంపిణీ: మంత్రి కేటీఆర్  

Also Read: Warangal Road Accident: రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News