Rishabh Pant tests positive for COVID-19: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో కరోనా కేసులు రావడం క్రికెట్ ప్రేమికులను, ఆటగాళ్ల కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేసింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల కరోనా బారిన పడ్డాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి చెందిన ఓ అధికారి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ గత ఎనిమిది రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం పంత్‌కు ఏ లక్షణాలు లేవని(Asymptomatic) తెలిపారు. డర్హమ్‌కు బయలుదేరిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టులో రిషబ్ పంత్ లేడని, త్వరలో అతడు జట్టుతో చేరతాడని చెప్పారు. పంత్ మినహా మిగతా జట్టు సభ్యులు గురువారం నాడు డర్హమ్‌కు బయలుదేరతారు. యూకేలో కోవిడ్19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా ఆటగాళ్లకు పలు సూచనలు, సలహాలిస్తూ ఈమెయిల్ చేసినట్లు సమాచారం. న్యూజిలాండ్ జట్టుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (World Test Championship) ఫైనల్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు బోర్డు బ్రేక్ ఇచ్చింది. 


Also Read: Covid-19: ఇంగ్లాండ్ పర్యటనలో ఇద్దరు Team India క్రికెటర్లకు కరోనా పాజిటివ్


టీమిండియా ఆటగాళ్లకు కరోనా కేసులపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. భారత జట్టులో ఒక్క ఆటగాడు మాత్రమే కోవిడ్19 బారిన పడ్డాడు. అతడు గత 8 రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు ప్రస్తుతం జట్టుతో లేడు. ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని పీటీఐతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఆటగాళ్లు ప్రొటోకాల్స్ పాటించాలని బీసీసీఐ కార్యదర్శి జై షా లేఖ రాశారని, దాన్ని పాటించాలని ఆటగాళ్లకు రాజీవ్ శుక్లా సూచించారు.


ఇంగ్లాండ్ అధిక కరోనా కేసులకు కారణమవుతున్న డెల్టా వేరియంట్‌ను రిషబ్ పంత్‌లో గుర్తించారు. ఇటీవల యూరో కప్ మ్యాచ్‌లకు తన స్నేహితులతో కలిసి పంత్ హాజరయ్యాడని తెలిసిందే. గత కొన్నిరోజులుగా అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అంతకుముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేశారు.


Also Read: T20 World Cup 2021: Shikhar Dhawan కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కే ఎక్కువ ఛాన్స్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook