Riyan Parag YouTube Search History: తాజాగా ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధిక పరుగులతో సత్తా చాటిన భారత యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ వివాదంలో చిక్కాడు. తన యూట్యూబ్‌ చానల్‌ లైవ్‌తో చిక్కుల్లో పడ్డాడు. తన యూట్యూబ్‌లో ప్రముఖ హీరోయిన్ల హాట్‌ వీడియోలు వెతుకుతున్న సెర్చింగ్‌ వివరాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల హాట్‌ ఫొటోలు వెతికాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌ సెర్చ్‌ హిస్టరీలో అభ్యంతరకరమైన కంటెంట్‌ ఉండడంతో రియాన్‌ పరాగ్‌ ట్రోల్స్‌కు చిక్కాడు. దీంతో పరాగ్‌ తీరుపై మండిపడుతున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hardik Pandya Divorce: క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా విడాకుల వార్తలు.. భార్య నటాషా స్పందన ఇదే!


ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున 22 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ తన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. లీగ్‌లో 573 పరుగులు చేసి టాప్‌ 3 స్కోరర్‌గా నిలిచాడు. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ ఓడిపోవడంతో లీగ్‌ను జట్టు వీడడంతో ప్రస్తుతం రియాన్‌ పరాగ్‌ తన యూట్యూబ్‌ చానల్‌ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసే గేమింగ్‌ చానల్‌ను రియాన్‌ పరాగ్‌ నడిపిస్తున్నాడు. గేమ్‌ ఆడుతూ యూట్యూబ్‌ ద్వారా సంపాదిస్తున్నాడు. ఈనెల 26వ తేదీ ఆదివారం రోజు రియాన్‌ పరాగ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశాడు. లైవ్‌ చేస్తున్న క్రమంలో రియాన్‌ పరాగ్‌ చేసిన యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసిన వివరాలు ఆసక్తికరంగా మారింది. 'కాపీరైట్‌ లేని సంగీతం' అని వెతుకుతున్న క్రమంలో రియాన్‌ పరాగ్‌ హీరోయిన్‌ల హాట్‌ వీడియోల కోసం వెతికినట్లు తెలిసింది.

Also Read: Kavya Maran Crying: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప


'అనన్య పాండే హాట్‌, సారా అలీఖాన్‌ హాట్‌' అని యూట్యూబ్‌లో రియాన్‌ పరాగ్‌ వెతికినట్లు కనిపించింది. ఇదంతా పరాగ్‌ తన పర్సనల్‌ సెర్చ్‌ ఇంజన్‌ హైడ్‌ చేయకపోవడంతో ఇది బయటపడింది. లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తున్న క్రమంలో అవి బయటపడడంతో నెటిజన్లు స్క్రీన్‌ షాట్లు తీసి దుయ్యబట్టారు. రియాన్‌ పరాగ్‌ యూట్యూబ్‌ సెర్చ్‌ హిస్టరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పరాగ్‌ యూట్యూబ్‌ సెర్చ్‌ హిస్టరీపై నెట్టింట్లో తీవ్ర దుమారం రేపింది. క్రికెట్‌ ఆటలోనూ.. ఆ ఆటలోనూ పెద్ద ఆటగాడివే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఐపీఎల్‌లో రియాన్‌ ప్రదర్శన
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రియాన్‌ పరాగ్‌ ఆడాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 52 సగటుతో 149 స్ట్రైక్‌రేటుతో దూకుడుగా ఆడాడు. ఈ సీజన్‌లో 573 పరుగులు చేసి ఈ సీజన్‌ టాప్‌ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ వైదొలగడంతో అత్యధిక స్కోరర్‌ అవార్డును రియాన్‌ కోల్పోయాడు.







స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter