Mohammad Rizwan T20 Record: పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించాడు. కేవలం ఒక్క క్యాలెండర్ ఇయర్ లోని టీ20 ఫార్మాట్ లో 2 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా ఘనత సాధించాడు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో మహ్మద్ రిజ్వాన్ ఈ ఫీట్ సాధించాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అతను మైలురాయిని దాటాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహ్మద్ రిజ్వాన్ తో పాటు కెప్టెన్ బాబర్ అజామ్ బ్యాటింగ్ తో విజృభించడం వల్ల విండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో కైవసం చేసుకుంది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ తొలి ఆరు ఓవర్లలోనే 60 పరుగులు చేయడం వల్ల జట్టుకు శుభారంభం లభించింది. 


ఆఖరి 10 ఓవర్లలో ఆతిథ్య జట్టు విజయానికి 110 పరుగులు చేయాల్సిన క్రమంలో పాకిస్తాన్ స్కోరు 98/0గా ఉంది. బాబర్, రిజ్వాన్ ఓపెనింగ్ వికెట్‌కు 158 పరుగులు జోడించారు, దీనితో ఇద్దరు బ్యాటింగ్‌లు తమ యాభై పరుగుల మార్కును దాటాయి. బాబర్ 79 పరుగులు చేసి నిష్క్రమించగా, రిజ్వాన్ 86 పరుగులు చేసి వెనుదిరిగాడు.  


ALso Read: Pak vs WI ODIs postponed: పాకిస్థాన్ vs వెస్టిండీస్ వన్డే సిరీస్ వాయిదా.. వణుకు పుట్టిస్తున్న పాజిటివ్ కేసులు


Also Read: IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోకి దక్షిణాఫ్రికా దిగ్గజం.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook