IND vs NZ 3rd ODI: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం! సిరీస్ క్లీన్‌స్వీప్
Rohit Sharma, Shubman Gill centuries power India to 385 Runs. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది.
Rohit Sharma and Shubman Gill Centuries help India post 386 runs target to New Zealand: ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసి.. కివీస్ ముందు 386 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (101; 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (54; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (36) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లు జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాంటిగ్‌కు అచ్చొచ్చిన ఇండోర్ పిచ్‌పై భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రెచ్చిపోయారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు చేశారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇద్దరు పోటీ పడి పరుగులు చేయడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు బాదారు. రోహిత్, గిల్‌లను ఔట్ చేయడానికి కివీస్ బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు.
దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు బాదారు. సెంచరీలు అనంతరం ఇద్దరు పెవిలియన్ చేరారు. విరాట్ కోహ్లీ (36; 27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) కొద్దిసేపు మెరుపులు మెరిపించినప్పటికీ.. భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఇషాన్ కిషన్ (17; 24 బంతుల్లో ఫోర్, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (14; 9 బంతుల్లో 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (9; 14 బంతుల్లో ఫోర్) నిరాశపరిచారు. ఇన్నింగ్స్ చివరలో హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ (25; 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా 400 పరుగుల మైలురాయిని సునాయాసంగా దాటుతుందని అంతా భావించినా.. అది సాధ్యం కాలేదు.
Also Read: ICC Test Team 2022: ఐసీసీ టెస్టు టీమ్.. భారత్ నుంచి ఒకే ఒక్కడు! ఆస్ట్రేలియా నుంచి నలుగురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.