ICC Test Team 2022: ఐసీసీ టెస్టు టీమ్.. భారత్ నుంచి ఒకే ఒక్కడు! ఆస్ట్రేలియా నుంచి నలుగురు

ICC Announces Mens Test Team Of The Year 2022. 2022 సంవత్సరానికి సంబంధించి తమ అత్యుత్తమ టెస్ట్ జట్టుని ఐసీసీ నేడు ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 24, 2023, 05:09 PM IST
  • ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్లు
  • భారత్‌ నుంచి ఏడుగురు ఎంపిక
  • రోహిత్ శర్మ మాత్రం లేడు
ICC Test Team 2022: ఐసీసీ టెస్టు టీమ్.. భారత్ నుంచి ఒకే ఒక్కడు! ఆస్ట్రేలియా నుంచి నలుగురు

ICC Announces Mens Test Team Of The Year 2022: 2022 సంవత్సరానికి సంబంధించి తమ అత్యుత్తమ పురుషుల టెస్ట్ జట్టుని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. ఐసీసీ అత్యుత్తమ టెస్ట్ జట్టులో కేవలం ఒకే ఒక్క ఆటగాడికి చోటు దక్కింది. 2022లో అద్భుతంగా ఆడిన వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్టు జట్టులోచోటు దక్కించుకున్నాడు. టెస్ట్ జట్టుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను ఐసీసీ సారథిగా ఎంపిక చేసింది. 2022 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లను ఎంపిక చేశామని ఐసీసీ పేర్కొంది. 

ఐసీసీ టెస్ట్ జట్టుకు ఓపెనర్లుగా ఉస్మాన్‌ ఖవాజా, క్రెయిగ్‌ బ్రాత్‌వెయిట్‌ ఎంపికయ్యారు. మూడో స్థానంలో మార్నస్‌ లబుషేన్‌.. నాలుగో స్థానంలో బాబర్‌ ఆజంను ఎంపిక చేసుకుంది. 5, 6, 7 స్థానాల్లో వరుసగా జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, రిషబ్ పంత్‌లను ఎంపిక చేసింది. పేస్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌, కగిసో రబడ, జేమ్స్‌ ఆండర్సన్‌ ఎంపిక కాగా.. స్పిన్‌ విభాగంలో నాథన్‌ లియోన్‌ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ జట్టులో స్థానం సంపాదించగా.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. 

25 ఏళ్ల రిషబ్ పంత్‌ 2022లో 12 ఇన్నింగ్స్‌లో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. గ్లోవ్స్‌తో కూడా సత్తాచాటాడు. ఆరు స్టంపింగ్‌లు మరియు 23 క్యాచ్‌లు అందుకున్నాడు. 2022 డిసెంబరు 30న కారు ప్రమాదానికి గురైన పంత్‌.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

2022 ఐసీసీ అత్యుత్తమ టెస్టు టీమ్:
ఉస్మాన్‌ ఖవాజా, క్రెయిగ్‌ బ్రాత్‌వెయిట్‌, మార్నస్‌ లబుషేన్‌, బాబర్‌ ఆజం, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, రిషబ్ పంత్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌, కగిసో రబడ, జేమ్స్‌ ఆండర్సన్‌. 

Also Read: Rohit Sharma Century: వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీ.. మూడేళ్ల నిరీక్షణకు తెర! పాంటింగ్‌తో కలిసి సమంగా  

Also Read: Maruti Gypsy Price: జిమ్నీని తలదన్నే మారుతీ జిప్సీ.. సూపర్ గుడ్ లుకింగ్! ధర 6.8 లక్షలు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook.

Trending News