ICC: 2023 వన్డే అత్యుత్తమ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టాప్-11లో ఆరుగురు మనోళ్లే..
Rohit Sharma: రికార్డులు సృష్టించడం భారత ఆటగాళ్లు కొత్తమీ కాదు. ఐసీసీ ఈవెంట్స్ లో టీమిండియా ప్లేయర్స్ మరోసారి సత్తా చాటారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.
ICC ODI Team of the Year 2023: 'ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023'కి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన 11 మంది క్రికెటర్లలో ఆరుగురు భారత ఆటగాళ్లు, ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు మరియు ఒక కివీ ప్లేయర్ ఉన్నాడు. రోహిత్ తోపాటు గిల్, కోహ్లీ, సిరాజ్, మహ్మద్ షమీ మరియు కుల్దీప్ యాదవ్ లకు తుది జట్టులో చోటు దక్కింది.
గతేడాది గిల్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో 29 గేమ్‌లలో 63.36 అత్యుత్తమ సగటుతో 1584 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. క్యాలెండర్ ఇయర్‌లో అతను ఐదు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లి మరియు రోహిత్ వరుసగా 1377 మరియు 1255 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ మరియు డారిల్ మిచెల్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఇతడు 2023లో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. సఫారీ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ కు కూడా చోటు దక్కింది.
గతేడాది అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆడమ్ జంపాను కూడా ఎంపిక చేశారు. అతడు 20 మ్యాచ్‌లలో 26.31 సగటుతో 38 వికెట్లు సాధించాడు. టీమిండియా బౌలర్లు కుల్దీప్ (49 వికెట్లు), సిరాజ్ (44 వికెట్లు) మరియు షమీ (43 వికెట్లు)లకు కూడా ఫైనల్ టీమ్ లో స్థానం లభించింది. సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టు (T20 Team Of The Year 2023)లో కూడా నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం.
వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), మార్కో జాన్‌సేన్, ఆడం జంపా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షహీ.
టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, సికందర్ రజా, అల్పేష్ రంజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎంగర్వ, అర్ష్‌దీప్ సింగ్.
Also Read: Kohli Duplicate Video: అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook