Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓదార్చిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
Rohit Sharma Emotional Video: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. హిట్‌మ్యాన్ కన్నీళ్లు పెట్టుకోగా.. విరాట్ కోహ్లీ భుజంపై చేయి వేసి సముదాయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Rohit Sharma Emotional Video: టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడేందుకు టీమిండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి.. పొట్టి కప్‌లో పదేళ్ల తరువాత ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు 2014 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఫైనల్ పోరులో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి.. 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగే ఫైనల్ యుద్ధంలో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. టీమిండియా విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీరోల్ ప్లే చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తోపాటు సూపర్ కెప్టెన్సీతో జట్టును ముందుండి నడిపించాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేసి.. భారత్ స్కోరు 171 పరుగులకు చేరేలా చేశాడు.
Also Read: Love Affair: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. కూతురు జోలికి రావొద్దన్నందుకు కత్తులతో..
సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన తరువాత హిట్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ బయట కుర్చీలో కూర్చుని ఏడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. రోహిత్ శర్మతో కరచాలనం చేసేందుకు తోటి ఆటగాళ్లు వచ్చినప్పుడు.. ఉబికి వస్తున్న కన్నీళ్లను దాచుకున్నాడు. రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ సముదాయించినట్లు ఆ వీడియోలో ఉంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన తరువాత తనకు నిద్రపట్టలేదని రోహిత్ శర్మ చెప్పిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ రూపంలో హిట్‌మ్యాన్‌కు మరో ఛాన్స్ వచ్చింది. టీమిండియాకు ప్రపంచకప్ అందించే సువర్ణావకాశం కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైనల్ మ్యాచ్‌లోనూ ఇదే జోరు కనబరిస్తే.. టీమిండియా ఈజీగా విజయం సాధిస్తుంది.
ఇంగ్లాండ్‌పై టీమిండియా అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ దుమ్ములేపారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 73 రన్స్ జోడించారు. చివర్లో హార్థిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (17 నాటౌట్) దూకుడుగా ఆడారు. దీంతో టీమిండియా 171 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 103 పరుగులకే బౌలర్లు ఆలౌట్ చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లియామ్ లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter