Rohit Sharma hit Most Sixes for India in T20 World Cup: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డు బద్దలు కొట్టాడు. భారత్ తరపున టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ గా నిలిచాడు. గురువారం నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్ 63 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 34 సిక్సర్లు బాదగా రెండోస్థానానికి చేరుకున్నాడు. టీమిండిమా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌ 33 సిక్సర్లతో ఇప్పటివరకు భారత్‌ తరఫున మొదటిస్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి.. నెదర్లాండ్స్‌కు భారీ టార్గెట్ విధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట టాస్‌ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) మరోసారి పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆచితూచి బ్యాటింగ్ చేశారు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. తొలి 10 ఓవర్లకు 67 పరుగులు చేసింది భారత్. 


35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ (39 బంతుల్లో 53) జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్లాసెన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మరోఎండ్‌లో కోహ్లి పాతుకుపోగా.. క్రీజ్‌లో వచ్చిన సూర్యకుమార్‌ వస్తూనే బ్యాట్ ఝులిపించాడు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు బాదడంతో స్కోర్డు బోర్డు పరుగులు పెట్టింది.


ఈ క్రమంలో విరాట్ కోహ్లి 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి సిక్సర్ బాది సూర్యకుమార్ యాదవ్ కూడా 50 పరుగుల మార్క్ దాటేశాడు. కోహ్లి 62, సూర్య 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ తలో వికెట్ తీశారు. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. 


Also Read: Director Esmayeel Shroff: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత  


Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook