Director Esmayeel Shroff: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Director Esmayeel Shroff Passes Away: ప్రముఖ సీనియర్‌ డైరెక్టర్ ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ (62) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 01:42 PM IST
Director Esmayeel Shroff: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Director Esmayeel Shroff Passes Away: బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ డైరెక్టర్ ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ (62) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత కొద్ది రోజులుగా ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ అంబానీ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. ఇస్మాయిల్‌ను రక్షించేందుకు వైద్యులు చివరి వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇస్మాయిల్‌ ష్రాఫ్‌ కెరీర్‌లో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు గోవింద నటించిన 'లవ్ 86' సినిమాతో ఆయన సినీ కెరీర్‌ ఆరంభించారు. 'థోక్ సి బేవఫై' చిత్రంతో ఇస్మాయిల్‌కు మంచి పేరు వచ్చింది. ఆయన మరణంపై గోవిందా సంతాపం తెలిపారు. ఇస్మాయిల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

ఇస్మాయిల్ తనకు మంచి ఆఫర్ ఇవ్వడమే కాకుండా తనను చాలా నమ్మారని అన్నారు హీరో గోవిందా. తనకు సినిమాపై అవగాహన ఉందని చెప్పిన మొదటి వ్యక్తి ఆయననేని చెప్పారు. గోవింద్ నుంచి స్టార్ హీరో గోవిందాగా మారడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఇస్మాయిల్.. భీమ్‌సింగ్‌కి సహాయకుడిగా కొద్దికాలం పని చేశారు. తరువాత 'తోడి సి బేవఫై' సినిమాతో దర్శకుడిగా తన తొలి విజయాన్ని అందుకున్నారు. ఇది కాకుండా అహిస్తా అహిస్తా, బులంది, సూర్య వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన సినీ జీవితంలో మొత్తం 15 చిత్రాలను డైరెక్ట్ చేశారు. 2004లో విడుదలైన 'తోడా తుమ్ బద్లో తోడ హమ్' ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం.
 

Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు  

Also Read: Manish Tewari: కరెన్సీ నోట్లపై అంబేదర్క్ ఫొటో.. తెరపైకి కాంగ్రెస్ డిమాండ్.. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News