వన్యప్రాణులపై ఉదారతను చాటుకున్న క్రికెటర్ రోహిత్ శర్మ
హైదరాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భారత ఖడ్గమృగాల్ని కాపాడే బాధ్యత చేపట్టాడు. దేశంలోని కొమ్ము ఖడ్గమృగాలు చాలా అరుదుగా కనిపిస్తున్న తరుణంలో క్రికెటర్ రోహిత్ శర్మ తన ఉదారతను చూపాడు. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉండే ఈ రైనోలు ఇప్పుడు 20వేల కంటే తక్కువే ఉన్నాయని వన్య సంరక్షణ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భారత ఖడ్గమృగాల్ని కాపాడే బాధ్యత చేపట్టాడు. దేశంలోని కొమ్ము ఖడ్గమృగాలు చాలా అరుదుగా కనిపిస్తున్న తరుణంలో క్రికెటర్ రోహిత్ శర్మ తన ఉదారతను చూపాడు. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉండే ఈ రైనోలు ఇప్పుడు 20వేల కంటే తక్కువే ఉన్నాయని వన్య సంరక్షణ అధికారులు తెలిపారు. ఫలితంగా అంతరించిపోయే జాతుల లిస్టులో ఈ రైనోలు చేరడంపై వన్య ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
అస్సాంలోని (కజిరంగా జాతీయ పార్క్) ఖడ్గమృగాల పరిరక్షణకై కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు మందగమనాన్ని సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఇందుకు అనేక కారణాలుండగా, ఒకటి వేటగాళ్లు, రెండోది తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం అని తెలిపారు. అడవుల్లో భాగమైన అల్యూవియల్ గడ్డి మైదానాల్ని పెంచాల్సిన అవసరం ఉంటుందని, ఎందుకంటే ఈ గడ్డి లేకపోవడంతో చాలా ఖడ్గమృగాలు చనిపోతున్నాయని తెలిపారు. ఈ గడ్డి మైదానాల్ని పెంచేందుకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) ఇండియా ప్రయత్నిస్తోందని, పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తోందని తెలిపారు.
ఇందులో భాగంగా… టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సాయం తీసుకుంది. వన్య ప్రాణి సంరక్షణపై రోహిత్ శర్మ ద్వారా ప్రచారం చేయిస్తోంది. ఖడ్గమృగాల్ని కాపాడదామని పిలుపునిస్తున్న రోహిత్ శర్మ విరాళాలు ఇవ్వాల్సిందిగా అభిమానులను కోరుతున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..