Rohit Sharma : టీ20 ప్రపంచకప్ కు రోహిత్ శర్మ దూరమా? ముక్కు నుంచి రక్తం కారడంతో అభిమానుల్లో ఆందోళన...
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్న టీట్వంటీ ప్రపంచ కప్ ఆడుతారా.. లేదా. ఇదే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను కలవరపరుస్తోంది. గౌహతిలో సఫారీలతో జరిగిన రెండో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో రోహిత్ శర్మకు ఏమైందనే ఆందోళనలో అభిమానుల్లో కనిపిస్తోంది.
Rohit Sharma : గౌహతిలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను పరేషాన్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల్లో టీట్వంటీ ప్రపంచకప్ జరగనుండగా జరిగిన ఈ ఘటనతో.. మెగా టోర్నీకి రోహిత్ శర్మ దూరం కానున్నారా అన్న చర్చ సాగుతోంది. హిట్ మ్యాన్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.
భారత్ ఇచ్చిన భారీ టార్గెట్ ను సఫారీలు ఛేజింగ్ చేసే క్రమంలో రోహిత్ శర్మ దగ్గరకు వచ్చిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కర్చీఫ్ ఇచ్చాడు. దాంతో ముక్కు తుడుచుకున్నాడు రోహిత్ శర్మ.ఆ సమయంలోనే రోహిత్ టీషర్ట్ పై రక్తం మరకలు కనిపించాయి. కర్చీఫ్ తో ముక్కు తూడుచుకుంటూనే బౌలర్ హర్షల్ పటేల్ కు రోహిత్ శర్మ సూచనలు చేయడం లైవ్ లో కనిపించింది. కాసేపటికి రోహిత్ శర్మ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లాడు. ముక్కు నుంచి రక్తం కారడం ఆగకపోవడంతోనే కెప్టెన్ మైదానం నుంచి బయటికి వెళ్లారని తెలుస్తోంది. ముక్కులు చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి గ్రౌండ్ లోకి వచ్చాడు రోహిత్ శర్మ.
లైవ్ లో ఈ ఘటనలు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనకు లోనయ్యారు. రోహిత్ శర్మకు ఏమైంది.. ముక్కు నుంచి రక్తం ఎందుకు కారిందని కలవరపడ్డారు. అయితే డీహైడ్రేషన్ వల్లే రోహిత్ శర్మ ముక్కు నుంచి రక్తం కారిందని వైద్యులు చెబుతున్నారు. అయినా క్రికెట్ అభిమానుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. బ్యాటింగ్ సమయంలోనూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా పేసర్ పార్నెల్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ మణికట్టుకు గాయమైంది. పార్నెల్ వేసిన మూడో బంతిని రోహిత్ స్కూప్ షాట్‌తో ఫోర్ కొట్టాడు. ఈ షాట్ ఆడే క్రమంలో బంతి రోహిత్ శర్మ గ్లౌవ్స్ తాకి వికెట్ కీపర్ పక్క నుంచి బౌండరీ లైన్ కు వెళ్లింది. బంతి తాకడంతో నొప్పితో కాసేపు రోహిత్ శర్మ విలవిలలాడాడు.
టీట్వంటీ ప్రపంచ కప్ కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్లు బుమ్రా, దీపక్ హుడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.తాజా ఘటనతో టీమిండియా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. సఫారీలతో ఇప్పటికే సిరీస్ గెలిచినందున చివరి మ్యాచులో రోహిత్ శర్మకి రెస్ట్ ఇస్తే బెటరని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.
Read Also: Suryakumar Yadav: వామ్మో ఇదేం బ్యాటింగ్.. సూర్యకుమార్ యాదవ్ మరో ప్రపంచ రికార్డ్
Read Also: Fans Fight: స్టేడియంలో జరిగిన గొడవల్లో 8 వందల మందికి పైగా మృతి.. ఇప్పటివరకు జరిగిన ఘోర విషాదాలు ఇవే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook