Suryakumar Yadav: వామ్మో ఇదేం బ్యాటింగ్.. సూర్యకుమార్ యాదవ్ మరో ప్రపంచ రికార్డ్

Suryakumar Yadav: ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డ్ సాధించాడు.  

Written by - Srisailam | Last Updated : Oct 3, 2022, 11:24 AM IST
  • సఫారీలపై సూర్యకుమార్ జోరు
  • 22 బంతుల్లో 61 పరుగులు
  • తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు
Suryakumar Yadav: వామ్మో ఇదేం బ్యాటింగ్.. సూర్యకుమార్ యాదవ్ మరో ప్రపంచ రికార్డ్

Suryakumar Yadav World Record: సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు ఇప్పుడు ఇండియన్  క్రికెట్ లో ఓ వైబ్రేషన్. అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిపోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆయన ఆటతీరుతో రికార్డులన్ని బద్దలవుతున్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్య కుమార్ యాదవ్.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదివారం సౌతాఫ్రికాతో గౌహతిలో జరిగిన మ్యాచ్ లోనూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార యాదవ్. ఈ క్రమంలోనే మరో ప్రపంచ రికార్డ్ సాధించాడు.

గౌహతి మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్లు రెచ్చిపోయారు. ఓపెనర్  కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ధాటిగా ఆడారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ వీర బాదుడు బాదారు.  సూర్యకుమార్ యాదవ్ అయితే చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. సికర్లు, బౌండరీలతో బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేశారు సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలో వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టాడు  అంతర్జాతీయ టీ20లో అతితక్కువ బంతుల్లో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 573 బంతుల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు సూర్యకుమార్ యాదవ్.  గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ పేరిట ఉండేది. మాక్స వెల్ ఈ ఫీట్ ను 604 బంతుల్లో సాధించాడు. కాని సూర్య కుమార్ యాదవ్ కేవలం  573 బంతుల్లోనే థౌజెండ్ రన్స్ ఫీట్ క్రాస్ చేసి ప్రపంచ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.

సఫారీలపై వచ్చి రావడంతోనే తన ప్రతాపం చూపించాడు సూర్యకుమార్ యాదవ్. పిచ్ మీద డ్యాన్స్ చేస్తున్నట్లుగా ముందుకు వచ్చి కొట్టిన షాట్లకు బంతి బౌండరీ లైన్ దాటి పోయింది.  పిచ్‌కు దూరంగా వెళ్తున్న వైడ్‌ బంతిని కూడా వెంటాడి బౌండరీలకు తరలించాడు యాదవ్. భుజాల ఎత్తులో వచ్చిన పుల్ టాస్ బంతిని స్టాండ్స్ లోకి పంపించిన షాట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. షార్ట్ పిచ్ బంతిని వికెట్ కీపర్ వెనకాలకు సిక్సర్ కొట్టిన షాట్ ను చూసి తరించాల్సిందే. భీకర ఫామ్‌లో వీర బాదుడు బాదుతున్న సూర్యకు ఎక్కడ బంతి వేయాలో కూడా అర్ధంకాని పరిస్థితి బౌలర్లది.

Read also: తెలుగులో ఉన్న సినిమాని రీమేక్ చేయడానికి పిచ్చోళ్లేమీ కాదు.. మాస్టర్ ప్లాన్ వేరే ఉందం

Read also: Bathukamma 2022: బతుకమ్మ పండుగను పూర్వికులు ఇలా జరుపుకునే వారట.. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News