Rohit Sharma Replaces Virat Kohli as India's ODI Captain : టీమిండియా వన్డే కెప్టెన్‌గా హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మను (Rohit Sharma) నియమించాలని భారత క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రకటనను వెల్లడించింది. కెప్టెన్సీ పగ్గాలను రోహిత్‌ శర్మకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక ఇప్పుడు టీ20లకు (T20I series ) సారధిగా ఉన్న రోహిత్‌.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ మొత్తానికి టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌గా ఉన్నటువంటి కోహ్లి ఇక టెస్ట్‌ మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : ICC Test Rankings: రెండో స్థానంకు ఆర్ అశ్విన్.. 31 స్థానాలు ఎగబాకిన మయాంక్‌!


వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని (Virat Kohli) తప్పించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉండడంతో ఓడీఐ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌కే ఇవ్వాలని బీసీసీఐ (BCCI) భావించింది. అలాగే సెలెక్టర్లు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మతోనూ చర్చలు సాగించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.



 


Also Read : Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌ మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook