Rohit Sharma Shocked By Virat Kohli's Decision To Step Down As India Test Captain: టీమిండియా టెస్టు సారథిగా తప్పుకొంటున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) శనివారం (జనవరి 15) ప్రకటించి అందరికి భారీ షాక్​ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్​ ఓటమి అనంతరం.. విరాట్ సోషల్​ మీడియాలో ఈ అనూహ్య ప్రకటన చేశాడు. దీంతో మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి కోహ్లీ స్వయంగా తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి మాత్రం బీసీసీఐ (BCCI) తప్పించింది. ఏదేమైనా కోహ్లీ మూడు నెలల్లో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు పెద్ద సంచలంగా మారింది. విరాట్ అభిమానులు (Team India Fans) ఈవిషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అంశంపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా షాక్‌కు గురయ్యాడట. ఈ విషయాన్ని రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. కోహ్లీతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి.. 'విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. భారత జట్టు కెప్టెన్‌గా విజయవంతమైన నీకు శుభాకాంక్షలు. విరాట్.. నీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. 


Also Read: Acharya New Release Date: చిరంజీవి ఫ్యాన్స్‌కు శుభవార్త.. 'ఆచార్య' విడుదలకు డేట్ ఫిక్స్! రిలీజ్ ఎప్పుడో తెలుసా?


దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ (IND vs SA)​ ఓటమి అనంతరం జట్టు సభ్యులతో సమావేశం అయిన విరాట్ కోహ్లీ.. వాళ్లకు తన కెప్టెన్సీ (India Test Captaincy) వదులుకోవడం గురించి చెప్పాడట. అయితే ఆ విషయాన్ని బయటకు వెల్లడించొద్దని కోరాడని సమాచారం. ప్రస్తుతం పరిమిత ఓవర్లకు కెప్టెన్​గా ఉన్న రోహిత్ ​శర్మను.. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్​ (Team India’s Next Test Captain) చేయడం దాదాపు ఖాయం. ఇక బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.



2015లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ.. 68 మ్యాచ్​ల్లో 40 విజయాలు అందించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 17 టెస్టులు ఓడిపోగా.. 11 డ్రా అయ్యాయి. టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. గ్రీమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48) విజయాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే టీమిండియాకు అత్యధిక టెస్ట్ విజయాలు అందించింది మాత్రం కోహ్లీనే. అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ కెప్టెన్​గా కోహ్లీ 213 మ్యాచ్​లు ఆడగా.. 135 మ్యాచ్​ల్లో భారత్ (India) విజయం సాధించింది. 60 మ్యాచ్​లు ఓడిపోగా.. 11 డ్రా అయ్యాయి.


Also Read: Telangana Cabinet Meet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై ఊహాగానాలు.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook