Telangana Cabinet Meet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై ఊహాగానాలు.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

Telangana Cabinet Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు (జనవరి 17) కేబినెట్ భేటీ జరగనుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ కట్టడి చర్యలపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 12:15 PM IST
  • సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీ
  • ప్రగతి భవన్‌లో సమావేశం కానున్న కేబినెట్
  • కరోనా కట్టడి చర్యలపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
 Telangana Cabinet Meet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై ఊహాగానాలు.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

Telangana Cabinet Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన రేపు (జనవరి 17) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ కట్టడి చర్యలపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ముందు జాగ్రత్త చర్యలపై వైద్యారోగ్య శాఖ సమర్పించే నివేదికపై భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో కరోనా కట్టడి చర్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం తెలంగాణలో రోజువారీ కేసులు 2 వేల మార్క్‌కి (Telangana Covid 19 Cases) కాస్త అటు, ఇటుగా నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఇప్పటికే విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను పొడగించింది.  ఈ నెల 20 వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీలో మరిన్ని కఠిన ఆంక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అంశంపై ఇటీవల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ (Minister KTR) వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సూచన మేరకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటి వాటిపై నిర్ణయం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. కేబినెట్ భేటీలో వైద్యారోగ్య శాఖ సిఫారసులపై చర్చించనుండటంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: పండగ పూట ప్రాణం తీసిన చైనా మాంజా... బండిపై వెళ్తుండగా అనూహ్య ఘటన

Also Read: Telangana : తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవుల పొడగింపు... ఈ నెల 30 వరకు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News