IND vs NZ: చెలరేగిన భారత బౌలర్లు.. మూడో వన్డేలో ఘన విజయం! 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
Rohit Sharma Century and Kuldeep Yadav 3 Wickets help India beat New Zealand in 3rd ODI. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Shardul Thakur and Kuldeep Yadav fire India beat New Zealand in 3rd ODI: ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 386 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. డ్వేన్ కాన్వే (138; 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ బాదడంతో కివీస్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో హెన్రీ నికోలస్ (42), మిచెల్ శాంట్నర్ (24) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
386 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో నికోలస్, కాన్వే రెండో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. నికోలస్‌ను శార్థూల్ ఔట్ చేసినా.. మిచెల్‌తో కలిసి కాన్వే మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 68 రన్స్ జోడించారు. క్రీజులో నిలబడిన కాన్వే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత భారీ షాట్లతో చెలరేగుతున్న కాన్వేను ఉమ్రాన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత బ్రేస్‌వెల్ (26)ను కుల్దీప్ బోల్తా కొట్టించాడు.
ఇన్నింగ్స్ చివర్లో శాంటర్న్ (34) బ్యాట్ ఝులిపించడంతో కివీస్ 295 రన్స్ చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్, శార్థూల్ తలా మూడు వికెట్లు తీశారు. చహల్ 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, ఉమ్రాన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు రోహిత్ శర్మ (101; 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. శార్దూల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు.
Also Read: Lucknow Building Collapse: లక్నోలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.