Rohit Sharma Three Sixes Away To Record 400 Sixes In T20s: భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన ఘనతను సాధించేందుకు చేరువలో ఉన్నాడు. టీ20ల్లో ఇప్పటివరకూ 397 సిక్సర్లు బాదిన హిట్‌ మ్యాన్‌.. మరో మూడు సిక్సర్లు కొడితే, ఈ ఫార్మాట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. నేటి నుంచి ప్రారంభంకానున్న రెండో దశ ఐపీఎల్‌-2021 తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌(Rohit Sharma) ఈ ఘనతను సాధించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందనంత ఎత్తులో గేల్..
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌(Chris Gayle) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గేల్‌ ఏకంగా 1042 సిక్సర్లు బాది ఈ జాబితాలో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గేల్‌ తర్వాతి స్థానాల్లో విండీస్‌ యోధులు పోలార్డ్‌(755), ఆండ్రీ రసెల్‌(509) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో రోహిత్‌(397) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్‌ కంటే ముందు ఆరోన్‌ ఫించ్‌(399), ఏబీ డివిలియర్స్‌(430), షేన్‌ వాట్సన్‌(467), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(485) ఉన్నారు. ఇక పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ క్రికెటర్ల విషయాకొస్తే.. ఈ లిస్ట్‌లో రోహిత్‌ తర్వాతి స్థానాల్లో సురేశ్‌ రైనా(324), విరాట్‌ కోహ్లి(315), ఎంఎస్‌ ధోని(303) ఉన్నారు.  ​


Also Read: IPL 2021: మళ్లీ ఐపీఎల్ పండగ వచ్చేసింది...ఇవాళ్టి నుంచి రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం


ఇదిలా ఉంటే,  క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2021(IPl-2021) రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్‌(Covid-19) కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో పునః ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై(10), బెంగళూరు(10), ముంబై(8) జట్లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook