RCB Record: ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు అరుదైన ఘనత సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ చరిత్రలో వందవ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ఖ్యాతి కెక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనతను దక్కించుకుంది. ఐపీఎల్‌ -2022 సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్‌లో వందో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ 214 మ్యాచ్‌లను ఆడింది. ఇందులో 100 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 107 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాలేదు. 


ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉంది. 219 మ్యాచ్‌ల్లో 125 విజయాలను సాధించింది. రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 198 మ్యాచ్‌ల్లో 117 విజయాలను నమోదు చేసింది. మూడో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఉంది. ఆ జట్టు 212 మ్యాచ్‌ల్లో 109 విజయాలను సాధించింది. 


ఐపీఎల్‌లో వందో విజయం సాధించడంతో ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతోపాటు ఆర్సీబీ బృందం రచ్చ రచ్చ చేసింది. ఆర్సీబీ యాజమాన్యం వెరైటీ వంటకాలతో కూడిన ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఆర్సీబీ నినాదాలు హోరెత్తాయి. దీంతో డ్రెస్సింగ్ రూమ్ మార్మోగిపోయింది. సంబరాల్లో కొత్త పెళ్లి కొడుకు మ్యాక్స్‌వెల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 


తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీ.. ముంబైతో తలపడనుంది. ఈనెల 9న పుణె వేదికగా ఇట్లు తలపడనున్నాయి. ఈమ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆడే అవకాశం ఉంది. అతడి రాకతో టాప్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. గత సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడిన మ్యాక్స్‌వెల్‌ అద్భుతంగా ఆడాడు. 


Also read: KKR Vs MI: ముంబయి X కోల్ కతా.. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లలో పైచేయి ఎవరిది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook