ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా జైపూర్‌లోని మాన్‌సింగ్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్‌ మరో బంతి మిగిలిఉండగానే ఛేదించింది. రాజస్థాన్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌ 95 పరుగులు నాటౌట్‌ (60 బంతుల్లో 11X4, 2X6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 


మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో అంబటి రాయడు(12), వాట్సన్ 39 పరుగులు (31 బంతుల్లో 2X4, 2X6), సురేష్ రైనా 52 పరుగులు (35 బంతుల్లో 6X4, 1X6‌), ఎం.ఎస్ ధోని 33 పరుగులు నాటౌట్ (23 బంతుల్లో 1X4‌, 1X6‌), సామ్‌ బిల్లింగ్స్‌ 27 పరుగులు (‌ 22 బంతుల్లో 3X4) చేశారు. దీంతో చెన్నై స్కోర్ 176 పరుగులకు చేరుకుంది. అయితే, ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్ తరుపున బ్యాటింగ్ కి వచ్చిన జోస్ బట్లర్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించి మరీ తన జట్టుని గెలిపించుకున్నాడు.