Ravichandran Ashwin Becomes First Batter To Retired Out In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022లో భాగంగా ఆదివారం వాంఖడే మైదానంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో యాష్ 28 పరుగుల వ్యక్తిగతగా స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఎవరూ ఊహించని రీతిలో రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. దాంతో ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో రిటైర్డ్‌ ఔట్‌ అయిన తొలి ఆటగాడిగా అశ్విన్‌ రికార్డుల్లో నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ఫార్మాట్‌లో మాత్రం రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన సందర్భాలు మూడు ఉన్నాయి. ఇప్పటివరకు ముగ్గురు బ్యాటర్లు రిటైర్డ్ ఔట్‌ అయ్యారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, భూటాన్ ప్లేయర్ సోనమ్ టోగ్బే, బంగ్లాదేశ్ క్రికెటర్ సుంజాముల్ ఇస్లాంలు క్రీజ్ మధ్యలో నుంచే ఔట్‌ కాకుండా పెవిలియన్ చేరారు. ఇప్పుడు ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ చేరాడు. మొత్తంగా టీ20 ఫార్మాట్‌లో రిటైర్డ్‌ ఔట్‌ అయిన బ్యాటర్ల సంఖ్య నాలుగుకు చేరింది.


హిట్టర్ అయిన రియాన్‌ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసమే రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడట. యాష్ రిటైర్డ్‌ ఔట్‌ అయిన సమయంలో 23 బంతుల్లో 28 పరుగులు చేశాడు. రిటైర్డ్‌ ఔట్‌ అంటే.. అంపైర్‌ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు చేరడం. ఇలా వెళితే సదరు బ్యాటర్ తిరిగి బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉండదు. అదే రిటైర్డ్‌ హర్ట్‌ (గాయపడిన సమయంలో) అయితే మాత్రం బ్యాటర్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. సదరు బ్యాటర్ ఇక్కడ చివరి బ్యాటర్‌గా మాత్రమే క్రీజులోకి వచ్చే అవకాశం ఉంటుంది. 


ఆర్ అశ్విన్ ఔట్ కాకుండానే పెవిలియన్‌కు వెళుతుండడంతో ప్రతిఒక్కరు ఆశ్చర్యాన్ని గురయ్యారు. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న షిమ్రోన్ హెట్మెయిర్‌కు కూడా ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయాడు. యాష్ అలా వెళతాడని తనకు కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేదని మ్యాచ్ అనంతరం స్వయంగా చెప్పుకొచ్చాడు. అలసిపోవడం వలనే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తాను భావించానని చెప్పాడు. అశ్విన్ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌ సిక్స్‌ కొట్టి జట్టును గెలిపించాడని హెట్మెయిర్‌ చెప్పుకొచ్చాడు. 


Also Read: Yuzvendra Chahal: ఆర్ఆర్ ఆటగాడు చాహల్ అరుదైన ఘనత, 150 వికెట్ల క్లబ్‌లో చేరిక


Also Read: IRCTC Booking: IRCTC వెబ్ సైట్ ద్వారా ఒకే నెలలో ఎక్కువ టికెట్లు బుక్ చేయడం ఎలా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook