RR vs MI IPL 2021 Match: రాజస్థాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని చిత్తు చేసిన Mumbai Indians
RR vs MI IPL 2021 Match highlights: ఐపిఎల్ 2021 సీజన్ దుబాయ్ షెడ్యూల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌తో, బౌలింగ్‌తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విధించిన 91 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు 8.2 ఓవర్లలో అతి సునాయసంగా ఛేధించింది.
RR vs MI IPL 2021 Match highlights: ఐపిఎల్ 2021 సీజన్ దుబాయ్ షెడ్యూల్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌తో, బౌలింగ్‌తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విధించిన 91 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు 8.2 ఓవర్లలో అతి సునాయసంగా ఛేధించింది. దీంతో 2021 సీజన్ ప్లేఆఫ్స్ రేసులో (IPL 2021 Playoffs) ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆశలు సజీవం చేసుకుంది.
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) 25 బంతుల్లో 50 పరుగులు (3 సిక్స్‌లు, 5 ఫోర్లు) కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 22 పరుగులు, సూర్యకుమార్ 13 పరుగులతో సరిపెట్టుకున్నారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిర్ రెహ్మాన్, చేతన్ జకారియా తలో వికెట్ తీశారు.
Also read : IPL 2021 Points table today: ఐపిఎల్ 2021 పాయింట్స్ పట్టికలో ఎవరు టాప్, ఎవరు ఫ్లాప్ ?
అంతకంటే ముందుగా టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ 19 బంతుల్లో 3x4, 1x6 లతో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపేనర్ యశస్వి జైశ్వాల్ 9 బంతుల్లో 3x4 లతో 12 పరుగులు చేశాడు.
ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైపాల్ ఔట్ అయిన తర్వాత రాజస్థాన్ ఆటగాళ్లు (Rajasthan Royals) కెప్టెన్ సంజు శాంసన్ (3), శివమ్ దూబె (3), గ్లెన్ ఫిలిప్స్ (4), శ్రేయాస్ గోపాల్ (0), చేతన్ జకారియా (6) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాటపట్టారు. ఎవిన్ లూయిస్, జైపాల్ చివర్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (8) వల్లే ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగారు. అలా రాజస్థాన్ జట్టు అతి స్వల్పమైన స్కోరుకే సరిపెట్టుకోగా.. ముంబై ఇండియన్స్ జట్టు (Mumbai Indians) ఆ లక్ష్యాన్ని ఊదిపారేసింది.
Also read : DC vs CSK match highlights: ఉత్కంఠభరితమైన పోరులో చెన్నైపె గెలిచిన ఢిల్లీ.. IPL 2021 లో అగ్రస్థానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook