SA vs ENG: టెస్టుల్లో ఇంగ్లీష్‌ జట్టు దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయఢంకా మోగించింది. ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో సౌతాఫ్రికా దూసుకెళ్లింది. ఓవర్‌ నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను దక్షిణాఫ్రికా ప్రారంభించింది. మరో 37 పరుగులు చేసి 326 రన్స్‌ వద్ద ఆలౌట్ అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఎర్వే 73, ఎల్గర్ 47, కేశవ్ మహరాజ్ 41 పరుగులు చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టుకు 161 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 149 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఘోర పరాభవాన్ని తన ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని గణంకాలు చెబుతున్నాయి.


2003లో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఇంగ్లీష్‌ జట్టు ఓటమి రుచి చూసింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రబడా ఐదు వికెట్ల తీయడంతో ఇంగ్లీష్‌ మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్ ఈనెల 25న మాంచెస్టర్ వేదికగా జరగనుంది.




Also read:Team India: ఆసియా కప్‌లో టీమిండియాకు అతడే కీలకం కానున్నాడు: సంజయ్ మంజ్రేకర్..!


Also read:Rajendra Prasad: టాలీవుడ్‌లో మరో విషాదం..నిరంతరం డైరెక్టర్ ఇక లేరు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook