Team India: ఆసియా కప్ 2022 సర్వం సిద్ధమవుతోంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో టోర్నీ జరగబోతోంది. ఈనెల 27న శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆ మరుసటి రోజు 28న దయాది దేశాలు భారత్, పాక్ తలపడనున్నాయి. ఆసియా కప్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన సిరీస్‌ల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ దేశాలను భారత్ మట్టి కరిపించింది.
త్వరలో ప్రారంభంకానున్న టోర్నీకి భారత్ సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బరిలో దిగనుంది. ఇప్పటికే రోహిత్ సేనను బీసీసీఐ ప్రకటించింది. ఈసారి సీనియర్ పేసర్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇటు హర్షల్ పటేల్ సైతం గాయంతో తప్పుకున్నాడు. ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో బౌలింగ్ దళం రంగంలోకి దిగనుంది. అర్ష్‌దీప్, అవేష్ ఖాన్, హార్ధిక్, భువనేశ్వర్ కుమార్‌లు బౌలింగ్ చేయనున్నారు.
ఇటు చాహల్, రవి బిష్ణోయ్, అశ్విన్, జడేజా స్పిన్ విభాగంలో సేవలు అందించనున్నారు. భువనేశ్వర్ కుమార్ ప్రధానంగా టీమిండియా బౌలింగ్‌ను నడించనున్నాడు. ఈక్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్‌లో భువనేశ్వర్ కుమార్ కీలకంగా మారనున్నాడని తెలిపాడు. దీపక్ చాహర్ సేవలు సైతం అవసరమని అభిప్రాయపడ్డాడు. జింబాబ్వే టూర్‌కు అతడిని ఎంపిక చేశారని..ఇది మంచి పరిణామం అని చెప్పాడు.
ఆసియా కప్‌కు స్టాండ్‌బైగా తీసుకున్నారని గుర్తు చేశాడు. జింబాబ్వే పర్యటనలో జరిగిన తొలి వన్డేలో అతడు బాగా రాణించడని..ఆసియా కప్‌లోనూ చోటు దక్కే అవకాశం ఉందన్నాడు. కఠిన పరిస్థితుల్లోనూ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడని..చాలా సందర్భాల్లో ఇది రుజువు అయ్యిందన్నాడు సంజయ్ మంజ్రేకర్. ఇన్నింగ్స్ ఆరంభంలో ఇన్,అవుట్ స్వింగ్‌లతో బంతులు సంధించగలడని తెలిపాడు.
డెత్ ఓవర్లలో పెద్దగా రాణించకపోయినా..టీమిండియాకు భువీనే కీలకమని స్పష్టం చేశాడు. భువీతోపాటు దీపక్ చాహర్‌కు బౌలింగ్ దళంలో చోటు దక్కితే ప్రత్యర్థులను కట్టడి చేయగలమని చెప్పాడు. ఇద్దరి బౌలింగ్ ఒకేలా ఉంటుందని..బంతులను స్వింగ్ చేయగలిగే సత్తా ఉందన్నాడు సంజయ్ మంజ్రేకర్.
Also read:LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు అంతా రెడీ..బ్యాట్ పట్టనున్న మాజీ స్టార్ ప్లేయర్..!
Also read:Trisha: రాజకీయాల్లోకి టాప్ హీరోయిన్ త్రిష..? ఏ పార్టీలో చేరబోతోందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook