South Africa announce squad for Test series vs India: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా (India vs South Africa) పర్యటనపై పలు అనుమానాలు నెలకొనగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. సఫారీ టూర్‌కు వెళ్లడం ఖాయం అని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం టెస్ట్, వన్డే సిరీస్‌లను ఆడతామని.. టీ20 సిరీస్‌ను మాత్రం తాత్కాలికంగా పోస్ట్‌ పోన్ చేసినట్టు తెలిపారు. ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17 నుంచి కాకుండా 26 నుంచి టెస్ట్ సిరీస్ మొదలవ్వనుంది. టెస్ట్ సిరీసు కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) జట్టును ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం మంగళవారం (డిసెంబర్ 7) దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) 21 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ డీన్ ఎల్గర్ (Dean Elgar) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న టెంబా బావుమా (Temba Bavuma).. టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. క్వింటన్ డికాక్, కాగిసో రబాడ, లుంగీ ఎంగిడి, ఐడెన్ మర్క్​రమ్, అన్రిచ్ నోర్జ్ వంటి స్టార్ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత బౌలర్ డువైన్ ఓలివియర్ (Duanne Olivier) జట్టులోకి వచ్చాడు. 2019 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున అతడు చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇటీవలి కాలంలో ఓలివియర్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 11.14 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. 


Also Read: Pushpa Trailer: పుష్ప ట్రైలర్‌ బాగా నిరాశపరిచింది.. అబ్బే ఊహించినంతగా లేదబ్బా!!


సోమవారం దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​లో మార్పు చేశారు. రివైజ్డ్ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) తాజాగా ప్రకటించింది. మూడు టెస్టులోని తొలి మ్యాచ్‌ సెంచూరియన్‌ వేదికగా డిసెంబరు 26న మొదలు కానుంది. 2022 జనవరి 3-7 మధ్య జొహాన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టు, 11-15 మధ్య కేప్‌టౌన్‌లో మూడో టెస్టు జరగనున్నాయి. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జనవరి 19, 21, 23న జరుగుతాయి. తొలి రెండు వన్డేలు పార్ల్ వేదికగా కాగా.. మూడో వన్డేకు కేప్‌టౌన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 


Also Read: Teenmar Mallanna: బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న-సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్


దక్షిణాఫ్రికా టెస్టు జట్టు ఇదే:
డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కాగిసో రబాడ, సరెల్ ఎర్వీ, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, ఐడెన్ మర్క్​రమ్, వియాన్ ముల్డర్, అన్రిచ్ నోర్జ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, గ్లెంటన్ స్టౌర్‌మాన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, సిసాండా మగాలా, ర్యాన్ రికెల్టన్, డువైన్ ఓలివియర్.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook