South Africa vs Zimbabwe Highlights, T20 World Cup 2022: ఐసీసీ మెగా టోర్నీల్లో ఎప్పటిలానే దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాకు అదృష్టం ఏమాత్రం కలిసి రాలేదు. ప్రోటీస్ విజయానికి వరుణుడు అడ్డుపడ్డాడు. నెగ్గాల్సిన మ్యాచ్ లో ఫలితం తేలకపోవడంతో జింబాబ్వేతో కలిసి పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా సోమవారం దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు తలపడ్డాయి.  అయితే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 5 వికెట్లు కోల్పోయి 79 రన్స్ చేసింది. మెదెవెరే 35 పరుగుల చేయడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. దక్షిణాఫ్రికా తరఫున లుంగి ఎన్‌గిడి రెండు వికెట్లు పడగొట్టాడు. మళ్లీ వర్షం కురవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం, మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించి.. దక్షిణాఫ్రికాకు 64 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 


లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన సఫారి జట్టుకు ఓపెనర్ క్వింటన్ డికాక్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. చతారా వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. మెుత్తంగా ఆ ఓవర్ లో 23 పరుగులు వచ్చాయి.  టీ20 ప్రపంచకప్‌లో తొలి ఓవర్లో ఓ టీమ్ చేసిన అత్యధిక స్కోరు ఇదేకావడం విశేషం. రెండో ఓవర్‌ నుంచి వర్షం ప్రారంభంకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. కొద్దిసేపటికే వరుణుడు శాంతిచడంతో మ్యాచ్ మళ్లీ మొదలు అయింది. డికాక్ 18 బంతుల్లో 47 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా మూడు ఓవర్లలో 51/0కి చేరుకుంది.  సఫారీ జట్టు విజయానికి మరో 13 పరుగులు మాత్రమే కావాలి. ఈ సమయంలో మళ్లీ భారీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసి.. రెండు జట్లుకు చెరో పాయింట్ ఇచ్చారు. 


Also Read: Bret Lee: భారత్ వరల్డ్ కప్ గెలవాలంటే ఇలా చేయాలి.. కోహ్లి బ్యాట్ మౌనంగా ఉండదు: బ్రెట్ లీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి