Bret Lee On Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కింగ్ కోహ్లి అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాకు క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని విజయాన్ని అందించాడు. కొన్నేళ్లపాటు చెప్పుకునేలా కోట్లాది మంది భారత అభిమానులకు దీపావళి పండుగ సంబరాన్ని రెట్టింపు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆసీస్ మాజీ స్పీడ్ స్టార్ బ్రెట్ లీ కూడా రన్ మెషిన్ విరాట్ కోహ్లిను ఓ రేంజ్‌లో పొగిడాడు. లెజండరీ ఆటగాళ్లలో కోహ్లి ఒకడిగా నిలిచిపోతాడని ప్రశంసించాడు. విరాట్ కోహ్లి బ్యాట్‌ను ఎక్కువ కాలం మౌనంగా ఉంచడం సాధ్యం కాదన్నాడు. ఇటీవల విరాట్ పేలవమైన ఫామ్‌పై వచ్చిన విమర్శలపై బ్రెట్ లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
‘కోహ్లి లాంటి బ్యాట్స్‌మెన్‌పై విమర్శలు వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కోహ్లిని విమర్శిస్తున్న వారికి అతని రికార్డులు, మూడు ఫార్మాట్స్‌లో ప్రదర్శన గురించి తెలియదేమో. ప్రతిసారి సెంచరీ, హాఫ్ సెంచరీలు చేయలేరు. క్రికెట్‌లో కోహ్లి దిగ్గజ ఆటగాడు. అలాంటి ఆటగాళ్లు ఎక్కువ కాలం మౌనంగా ఉండరని నాకు తెలుసు. కోహ్లిపై వస్తున్న విమర్శలు చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది..’ అంటూ చెప్పుకొచ్చాడు ఈ మాజీ స్పీడ్ స్టార్.
టీమిండియా బుమ్రా సేవలను కోల్పోయిందన్నాడు బ్రెట్ లీ. టోర్నీలో భారత్ గెలవాలంటే చివరి ఐదు ఓవర్లలో బాగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేసే జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంటుందని చెప్పాడు.
‘భవిష్యత్తులో డేవిడ్ వార్నర్‌కు ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలి. వార్నర్ చాలా తెలివైనవాడు. నా అభిప్రాయం ప్రకారం అతను ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉండేందుకు అన్ని విధాల అర్హుడే. బాల్ టాంపరింగ్ ఎపిసోడ్ తరువాత వార్నర్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని పక్కన పెట్టి.. ఆస్ట్రేలియా కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకుంటే నేను సంతోషిస్తా..’బ్రెట్ లీ చెప్పాడు.
Also Read: IND Vs PAK: టీడీపీతో అట్లుంటది.. ఇండియా-పాక్ మ్యాచ్‌లో జై అమరావతి నినాదం
Also Read: Govt Jobs Updates: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు.. అప్లై చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook