క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌తో కలిసి గిటార్ వాయించే అవకాశం దక్కింది ఆ ఘనుడికి. అయితే మీకో విషయం తెలుసా.. అతను సచిన్ కంటే పెద్ద క్రికెట్ లెజెండ్. ఆయనే వెస్టిండీస్ మేటి ఆటగాడు వివియన్ రిచర్డ్స్. రిచర్డ్స్ పుట్టినరోజు సందర్భంగా.. సచిన్ ఎప్పుడో తనతో కలిసి రిచర్డ్స్ గిటార్ వాయిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో ఫేస్బుక్‌లో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో సచిన్, రిచర్డ్స్‌ను తన బ్యాటింగ్ హీరోగా కూడా పేర్కొనడం గమనార్హం. మీకో విషయం తెలుసా..! వివియన్ రిచర్డ్స్ తన తొలి టెస్ట్‌ క్రికెట్ జీవితాన్ని 1974లో ఇండియాపై బెంగుళూరులో ఆరంగేట్రం చేసాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో 192 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టెస్టులలో అతడు మొత్తం 121 మ్యాచ్‌లు ఆడి 50.23 సగటుతో 8540 పరుగులు చేయడం విశేషం. అందులో 24 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో రిచర్డ్స్ అత్యధిక స్కోరు 291 పరుగులు. ఆయన టెస్టులలో 50 సార్లు వెస్టిండీస్‌కు నాయకత్వచాడు.  ఇప్పటివరకు కూడా ఒక్క టెస్ట్ సీరీస్ ఓడిపోని వెస్టీండిస్ సారధిగా రికార్డు రిచర్డ్స్ పేరిటే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING