Muttiah Muralitharan Biopic: స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ట్రైలర్ రిలీజ్ చేసిన సచిన్..
800 The Movie: స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూలర్ లాంచ్ చేశాడు.
Muttiah Muralitharan Biopic: ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినీ తారలు, క్రీడాకారులతోపాటు పలువురు జీవితకథల ఆధారంగా తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ధోని ది అన్ టోల్డ్ స్టోరీ, భాగ్ మిల్కా భాగ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించాయి. ఇప్పుడు అలాంటి ఓ దిగ్గజ క్రికెటర్ జీవితకథ తెరపై ఆవిష్కృతం కానుంది. శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (Muttiah Muralitharan Biopic) తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు.
మురళీధరన్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టర్ నటిస్తుండగా... ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమ నంబియార్ కనిపించనున్నారు. ఈ మూవీ ఆలిండియా పంపిణీ హక్కులను నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా తీసుకొచ్చే అవకాశం ఉంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సచిన్ టెండుల్కర్ రిలీజ్ చేశారు. ఇందులో మురళీధరన్ తన నిజ జీవితంతోపాటు క్రీడా జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలను చూపించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ మురళీధరన్ మాత్రమే. అందుకే ఈ మూవీకి 800 The Movie అని టైటిల్ పెట్టారు. ట్రైలర్ ను మేకర్స్ చాలా బాగా కట్ చేశారనే చెప్పాలి.
1992లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన మురళీధరన్ టెస్టులు, వన్డే క్రికెట్ లలో 1000 కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్స్ తీసిన రికార్డు ఇతడి పేరు మీదే ఉంది. మురళీధరన్ 2005 మార్చి 21 న తమిళ అమ్మాయి మదిమలార్ ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ పుత్రుడు ఉన్నాడు. ఇతడి పేరే నరేన్.
Also Read: Jailer Success: జైలర్ సక్సెస్ కంటిన్యూ.. అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళానిధి మారన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook