ఆయనొక రాజ్యసభ సభ్యులు. కాదు కాదు క్రికెట్ దేవుడు.. భారతరత్న అవార్డు గ్రహీత.. మీకీపాటికే తెలిసిపోయింటుంది ఆయనే సచిన్ టెండూల్కర్. ఈయనకు ఈ మధ్య ఒక ఘోర అవమానం జరిగింది. ఎప్పుడో కాదు.. మొన్ననే అదీ చట్టసభల్లో.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు వివరాల్లోకి వెళితే.. సచిన్ టెండూల్కర్ పార్లమెంట్ సభ్యులయ్యాక ఒక్కసారి కూడా పెద్దల సభలో మాట్లాడలేదు. ఐదేళ్లు కావొస్తున్నా.. ఒక్కసారి లేచి నిలబడి ప్రసంగించలేదు. దేశంలో క్రీడారంగం యొక్క వర్తమాన, భవిష్యత్తుల గురించి సభలో మాట్లాడాలనుకొని.. గతవారం ప్రసంగం కూడా సిద్ధం చేసుకొని వచ్చారు. కానీ ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు.


అయితే.. అప్పటికే.. పార్లమెంట్ లో ప్రధాన మంత్రి మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిన ఆరోపణలపై రభస జరుగుతోంది. మోదీ క్షమాపణ చెప్పేవరకు సభను అడ్డుకుంటామని చెప్పి.. కాంగ్రెస్, ఇతర విపక్షాలు కార్యకలాపాలను స్తంభింపజేశాయి. దాంతో సచిన్ సభలో ప్రసంగించకుండానే వెనుదిరిగారు.


తరువాత సచిన్ తన ప్రసంగం కాపీని ప్రవేట్ గా చదివి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. సచిన్ 'అమ్మ' గా పిలిచే లతామంగేష్కర్ కూడా దీనిపట్ల అసహనం, బాధ వ్యక్తం చేసింది. 'ఒక భారత రత్న అవార్డు గ్రహీతకు ఇదేనా మన దేశం ఇవ్వగలిగే మర్యాద?' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్ వేదికగా  సచిన్ కు జరిగిన 'అవమానం' పై స్పందించారు. వారెలా స్పందించారో మీరే చూడండి.