ప్రపంచ వెయింట్లిఫ్టింగ్ ఛాంప్ భారత్..!
22 సంవత్సరాల తర్వాత భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని అందించిన తొలి మహిళగా మీరాబాయి ఛాను వార్తల్లోకెక్కింది.
22 సంవత్సరాల తర్వాత భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని అందించిన తొలి మహిళగా మీరాబాయి ఛాను వార్తల్లోకెక్కింది. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి ఛాంపియన్ షిప్ సాధించిన ఛాను 48 కేజీల విభాగంలో తన సత్తాను చాటింది. స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 109 కేజీలు ఎత్తిన ఆమె కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పింది.
గతంలో ఇదే ఛాంపియన్ షిప్‌ను ఒలింపిక్స్ విజేత కరణం మల్లీశ్వరి 1995లొ కైవసం చేసుకోవడం విశేషం. ఈ సారి ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భారత్‌తో పాటు రష్యా, చైనా, ఖజికిస్థాన్, ఉక్రెయిన్, అజర్‌బైజాన్ లాంటి దేశాలకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్లు పాల్గొన్నారు. 2017 ఛాంపియన్ షిప్‌లో గెలుపొందిన మీరాబాయి ఛాను1994లో మణిపూర్‌లో జన్మించారు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్నారు.